కళ్లకింద నల్లటి వలయాలు తగ్గాలంటే ఇలా చెయ్యండి!

Purushottham Vinay
మీ శరీరంలో ఐరన్ లోపించడం వల్ల ఆ ప్రభావం కళ్ల చుట్టూ కనిపిస్తుంది. ఇక అటువంటి పరిస్థితిలో మీ కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. అలాగే కళ్లు ఉబ్బినట్లు కనిపిస్తాయి. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు ఆహారంలో అరటి, బచ్చలికూర, మెంతులు, ఆకు కూరలు, బీన్స్, పప్పు, నట్స్ ఇంకా అలాగే బ్రౌన్ రైస్ వంటి ఐరన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను బాగా తీసుకోవాలి.అలాగే ఇక మెరుగైన కంటి ఆరోగ్యానికి విటమిన్ ఎ ఉన్న ఆహారం కూడా చాలా ముఖ్యం. ఈ విటమిన్ కొల్లాజెన్ ఏర్పడటానికి చాలా బాగా సహాయపడుతుంది. విటమిన్‌ ఎ లోపంతో కళ్ల కింద నల్లటి వలయాల సమస్యతో పాటు మొటిమలు ఇంకా అలాగే ముడతలు వంటి పలు చర్మ సంబంధిత సమస్యలు వేధిస్తాయి. విటమిన్ ఎ లోపాన్ని అధిగమించడానికి మీరు ఆహారంలో పాలు, టమోటా, బత్తాయి, చేపలు, గుడ్డు ఇంకా అలాగే రెడ్ క్యాప్సికమ్ వంటి వాటిని చేర్చుకోవచ్చు.అలాగే విటమిన్ సి యాంటీఆక్సిడెంట్స్‌లో పుష్కలంగా ఉంటుంది. దీని కారణంగా శరీరంలో విషతుల్య పదార్థాలు ఈజీగా బయటకు పోతాయి. చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. విటమిన్‌ సి లోపం వల్ల ముఖం ఇంకా కళ్ల చుట్టూ ముడతలు ఏర్పడతాయి.


ఇటువంటి పరిస్థితుల్లో చర్మాన్ని మృదువుగా ఉంచుకోవడానికి ఇంకా కళ్ల చుట్టూ నల్లటి వలయాలను తొలగించడానికి విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇందుకోసం బ్రకోలీ, టొమాటో, నిమ్మ, నారింజ, బచ్చలికూర ఇంకా అలాగే క్యాలీఫ్లవర్ మొదలైన వాటిని ఖచ్చితంగా మీ ఆహారంలో చేర్చుకోవాలి.అలాగే విటమిన్-ఇ లోపం వల్ల శరీరానికి సరిపడా ఆక్సిజన్ అనేది అందదు. దీని ప్రభావం మీ చర్మం ఇంకా అలాగే కళ్లపై కూడా కనిపిస్తుంది. విటమిన్ ఇ లోపం వల్ల కంటి చూపు కూడా దెబ్బతింటుంది. అదేవిధంగా నల్లటి వలయాలు కూడా ఎక్కువగా ఏర్పాడతాయి. ఇక ఈ సమస్యను అధిగమించాలంటే విటమిన్ ఇ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. దాని లోపాన్ని అధిగమించడానికి, బాదం, వేరుశెనగ, బచ్చలికూర, పొద్దుతిరుగుడు విత్తనాలు, గుడ్లు, వాల్‌నట్‌లు, ఆకుకూరలు, బ్రకోలీ, మామిడి ఇంకా అలాగే బొప్పాయి మొదలైన వాటిని ఆహారంలో చేర్చుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: