పెరుగుతో అందమైన జుట్టు ఇంకా చర్మం మీ సొంతం!

Purushottham Vinay
వేసవి కాలంలో శరీరాన్ని బాగా చల్లబరిచే ఆహారాలను ఎక్కువగా తీసుకుంటారు. అలాంటి ఆహారాల్లో పెరుగు ఒకటని చెప్పాలి. పెరుగులో మంచి బ్యాక్టీరియా అనేది ఉంటుంది.ఇది మన కడుపుకు ఎంతగానో మేలు చేస్తాయి. జీర్ణవ్యవస్థను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరాన్ని బాగా చల్లబరుస్తుంది. పెరుగులో ప్రొటీన్లు ఇంకా అలాగే క్యాల్షియం ఎక్కువగా ఉంటాయి. అలాగే మీరు దీన్ని అల్పాహారంలో కూడా తీసుకోవచ్చు. దీంతో ఆరోగ్యంతో పాటు, పెరుగు జుట్టు ఇంకా చర్మానికి కూడా మేలు చేస్తుంది. వేసవిలో పెరుగును ఎన్నో రకాలుగా ఉపయోగించవచ్చు. ఇక దీన్ని ఎలా ఉపయోగించవచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం..వేసవి కాలంలో చర్మ సంరక్షణకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా మంచిది. పెరుగు మీ చర్మాన్ని యవ్వనంగా ఇంకా అలాగే ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుంది. మీరు పెరుగును ఫేస్ ప్యాక్‌గా  కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం ఒక గిన్నెలో శనగపిండి, పెరుగు ఇంకా అలాగే చిటికెడు పసుపు కలపి.. మీ ముఖానికి అప్లై చేయాలి. ఒక 15 నిమిషాల పాటు ఉంచి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.


ఇక ఈ ఫేస్ ప్యాక్ టాన్ ని తొలగించడానికి కూడా బాగా పనిచేస్తుంది.అలాగే వేసవి కాలంలో బలమైన సూర్యకాంతి కారణంగా జుట్టు పొడిగా ఇంకా నిర్జీవంగా మారుతుంది. సాప్ట్ హెయిర్ కోసం చాలా ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ ని వాడుతుంటారు. ఈ సందర్భంలో మీరు పెరుగును కూడా వాడవచ్చు. ఇది సహజమైన కండీషనర్‌గా కూడా పనిచేస్తుంది. ఇది మీ శిరోజాలను బాగా హైడ్రేట్ చేస్తుంది. ఇది పొడి ఇంకా అలాగే దెబ్బతిన్న జుట్టును నయం చేస్తుంది. పెరుగు, తేనె, కొబ్బరి నూనె కలిపి తలకు బాగా మసాజ్ చేసుకోవచ్చు. 20 నిమిషాల పాటు అలాగే ఉంచి శుభ్రం చేసుకుంటే చాలా మంచిది.పెరుగు చర్మాన్ని తేమగా మారుస్తుంది. పెరుగులో జింక్, ప్రోబయోటిక్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. వడదెబ్బ వల్ల ప్రభావితమైన చర్మంపై చల్లని పెరుగును కూడా పూయవచ్చు. దీన్ని 20 నుంచి 25 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: