చుండ్రుని తగ్గించే ఆయుర్వేద చిట్కాలు..

Purushottham Vinay
చలికాలంలో చాలా మందికి కూడా చుండ్రు సమస్య ఎక్కువగా వస్తుంది.ఇక దీనికి కారణం చాలా చల్లని వాతావరణం ఇంకా అలాగే చాలా వేడి నీటితో తల స్నానం చేయడం.అందువల్ల చుండ్రు సమస్య చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది.ఇక వంటగదిలోని కొన్ని పదార్ధాలతో ఈ చుండ్రు సమస్యను శాశ్వతంగా కూడా దూరం చేసుకోవచ్చు.అంతేగాక మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు ఒత్తిడి లేని జీవితాన్ని కూడా గడపడానికి ప్రయత్నించాలి. ఇక ఇప్పుడు శీతాకాలంలో ఎదురయ్యే చుండ్రు సమస్య నుండి తక్షణ ఉపశమనం కలిగించే కొన్ని సహజ ఆయుర్వేద చిట్కాల గురించి ఇక్కడ తెలుసుకోండి.

వేపాకులో యాంటీ బాక్టీరియల్ ఇంకా అలాగే యాంటీ ఫంగల్ లక్షణాలు అనేవి పుష్కలంగా ఉన్నాయి, ఇవి చుండ్రును తగ్గించడానికి ఇంకా అలాగే వివిధ జుట్టు సంబంధిత సమస్యలను కూడా తగ్గించడానికి సహాయపడతాయి. 4 కప్పుల నీటిలో కొన్ని వేపాకులు వేసి వాటిని మరిగించాలి. ఆ తర్వాత వడగట్టి ఇంకా చల్లగా చేసి తలకు అప్లై చేయాలి. ఒక అరగంట తర్వాత జుట్టుని శుభ్రం చేయాలి. ఇలా 2 నుండి 3 సార్లు ఒక వారంలో మీరు వేసుకోవచ్చు. ఇది చుండ్రును త్వరగా తగ్గించడానికి మీకు ఎంతగానో సహాయపడుతుంది.

ఇక జుట్టు సమస్యలకు కొబ్బరి నూనెకు మించిన ప్రయోజనం వేరొకటి లేదని చెప్పాలి.ఎందుకంటే కొబ్బరి నూనెలో యాంటీ ఫంగల్ లక్షణాలు అనేవి చాలా ఉన్నాయి. ఇది చుండ్రుతో పోరాడటానికి బాగా సహాయపడుతుంది. అంతేగాక ఇది డ్రై స్కాల్ప్‌ను తేమ చేస్తుంది. ఇంకా పొడి స్కాల్ప్ దురదను కూడా త్వరగా తగ్గిస్తుంది. కొద్దిగా కొబ్బరినూనెని తీసుకొని అందులో సగం నిమ్మకాయను పిండుకుని, ఇక ఆ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి కొన్ని నిమిషాలు పాటు మసాజ్ చేసి కనీసం 20 నిమిషాలు నానబెట్టి తర్వాత మైల్డ్ షాంపూతో తలను కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు కనుక చేస్తే చుండ్రు సమస్య త్వరగా పోవడమే కాకుండా అసలు రాకుండా కూడా చూసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: