డ్రైస్కిన్ సాఫ్ట్ గా అవ్వాలంటే ఇలా చెయ్యండి..!!

Purushottham Vinay
సాఫ్ట్ స్కిన్ కి ఓట్స్‌ చాలా మంచిది. వీటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, ఇవి చర్మాన్ని బాగా సాఫ్ట్ గా ఉంచుతాయి. అలాగే పెరుగు కూడా సాఫ్ట్ స్కిన్ కి చాలా మంచిది. ఇందులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది.ఇది చర్మం పొలుసు ఊడిపోవడంలో ఎంతగానో సహాయపడుతుంది. అలాగే జోజోబా ఆయిల్ లేదా కొబ్బరి నూనె చర్మ తేమను కాపాడడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఇక ఈ స్క్రబ్ చేయడానికి, రెండు టీస్పూన్ల ఓట్ మీల్ ఇంకా ఒక టీస్పూన్ పెరుగు అలాగే ఒక టీస్పూన్ జోజోబా ఆయిల్ లేదా కొబ్బరి నూనెను కలిపి ఒక పేస్ట్‌లా తయారు చేయండి. ఇక ఆ తర్వాత ఆ పేస్ట్‌ని తీసుకుని మీ ముఖంపై 30-60 సెకన్ల పాటు వృత్తాకారంలో బాగా మసాజ్ చేయాలి. ఇక అలా చేసిన తరువాత మీ ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడుక్కుంటే మంచి ఫలితం ఉంటుంది.చర్మం యొక్క తేమను నిర్వహించడానికి అలాగే మొటిమల సమస్యను ఈజీగా తొలగించడానికి తేనె చాలా బాగా సహాయపడుతుంది.

తేనె సహజమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా ఇంకా అలాగే మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.ఇక ఈ స్క్రబ్ చేయడానికి, 1/4 కప్పు ఓట్ మీల్ ఇంకా 1/6 కప్పు తేనె అలాగే 1/6 కప్పు జొజోబా ఆయిల్ మిక్స్ చేసి బాగా కలిపి పేస్ట్ చేయండి. ఇక ఆ తర్వాత ఆ పేస్ట్‌ని తీసుకుని చర్మంపై వృత్తాకారంలో ఒక నిమిషం పాటు బాగా మృదువుగా మసాజ్ చేయండి.అలా చేసిన తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని బాగా కడిగితే మంచి ఫలితం ఉంటుంది.ఇక అలాగే పొడి చర్మం విషయంలో, కాఫీ స్క్రబ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది సహజంగా చర్మాన్ని బాగా ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. ఇంకా అలాగే డెడ్ స్కిన్ సెల్స్‌ను కూడా తొలగిస్తుంది. మీ చర్మాన్ని లోపలి నుండి బాగా శుభ్రపరుస్తుంది.అందువల్ల చర్మం చాలా మృదువుగా ఉంటుంది. ఇక ఈ స్క్రబ్ చేయడానికి, ఒక టీస్పూన్ కాఫీ పౌడర్‌ను ఒక టీస్పూన్ నీటిలో కలిపి బాగా పేస్ట్‌లా తయారు చేయండి. ఇక ఆ తర్వాత ఈ పేస్ట్‌ని వృత్తాకారంలో 4-6 నిమిషాల పాటు సున్నితంగా మీ ముఖానికి బాగా మసాజ్ చేయండి. ఇలా చేసిన తర్వాత మీ ముఖాన్ని శుభ్రంగా కడుక్కుంటే మంచి ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: