ఈ ముశ్రమాలతో మొటిమలు పరార్..

Purushottham Vinay
కొంతమంది మొటిమల నుండి తక్షణ ఉపశమనం పొందేందుకు కొన్ని క్రీములను ఉపయోగిస్తే ఇంకా మరికొందరు మాత్రం మేకప్‌తో వాటిని దాచడానికి ఇష్టపడతారు. మేకప్ ని ఉపయోగించి దీన్ని తాత్కాలికంగా మాత్రమే తొలగించవచ్చు. అయితే దీనికి శాశ్వత పరిష్కారం అనేది మాత్రం ఉండదు.అయితే, కొన్ని ఇంటి చిట్కాలు ఈ మచ్చలను తగ్గించడంలో మీకు చాలా సహాయపడతాయి.ఇక ఈ మొటిమల మరకను మీ ఇంటి నివారణలను ఉపయోగించి సమస్యను పరిష్కరించవచ్చు. ఇక దీని నుంచి మీరు శాశ్వత ఉపశమనం పొందవచ్చు.ఇక దీని కోసం మీరు ఖరీదైన ఖర్చు చేయవలసిన పని అసలు లేదు. అలాగే వీటి వల్ల మీకు ఎటువంటి దుష్ప్రభావాలు అనేవి కూడా ఉండవు.
1.గ్రీన్ టీ ఇంకా నిమ్మరసం..
కావాల్సిన పదార్థాలు
రెండు టేబుల్ స్పూన్లు గ్రీన్ టీ
అలాగే కొన్నిచుక్కల నిమ్మరసం
ఇక ఉపయోగించే విధానం..
ముందుగా గ్రీన్ టీని పింగాణీ గిన్నెలో వేయండి.తరువాత దానికి నిమ్మరసం ఇంకా గ్రీన్ టీ కలపండి.శుభ్రమైన పత్తిని ఉపయోగించి ప్రభావిత ప్రాంతానికి అప్లై చెయ్యండి.ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. ఇక ఇక మంచి ఫలితాల కోసం ఇలా రోజుకు మూడు సార్లు ఈ మిశ్రమాన్ని ఉపయోగించండి.
2.గ్రీన్ టీ ఇంకా టొమాటో..
ఇందుకు కావాల్సిన పదార్థాలు
రెండు టేబుల్ స్పూన్లు గ్రీన్ టీ
రెండు టేబుల్ స్పూన్లు టమోటా రసం
ఇక ఈ మిశ్రమం తయారు చేయు విధానం..
టొమాటో రసం ఇంకా అలాగే గ్రీన్ టీని చిన్న పింగాణీలో కలపండి.తరువాత దీన్ని మీకు మొటిమలు వున్న ప్రభావిత ప్రాంతంలో అప్లై చేసి 2 నుంచి 3 నిమిషాల పాటు మసాజ్ చేయాలి.అలాగే ఇక ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచండి.తరువాత మీ ముఖాన్ని వేడి నీళ్లతో కడిగి ఆరనివ్వాలి.ఇక మీరు మంచి ఫలితాలను పొందడానికి ఇలా రోజుకు రెండుసార్లు ఉపయోగించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: