ఇలాంటి జుట్టుతో మీ అందం రెట్టింపు...

VAMSI
ఆడ వారికి జుట్టు అనేది ఒక ప్రత్యేకమైన అలంకారం. ఎంత పొడవుగా, ఎంత వొత్తుగా, ఎంత నల్లగా, ఎంత కాంతివంతంగా ఉంటుందో అంత అందంగా కనిపిస్తారు. ముఖం ఎంత అందంగా ఉన్నప్పటికీ జుట్టు పలుచగా నిర్జీవంగా ఉంటే వారి ముఖం తేజస్సుగా కనిపించదు. ఆకర్షణీయంగా అనిపించరు. అందుకే జుట్టు అనేది అందంగా ఉంటే మనం ముఖం కూడా అంతే తేజస్సుతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. చాలా మంది తమ జుట్టు పట్టులా చాలా మృదువుగా ఉండాలని అనుకుంటుంటారు. అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే మీ జుట్టు పట్టుకుంటే పట్టులా జారిపోయే అంత నునుపుగా, అలాగే కాంతి వంతంగా రెడీ అవ్వాలి అంటే కొన్ని చిట్కాలను పాటించండి అంటున్నారు అనుభవజ్ఞులు. అవేంటో ఇపుడు తెలుసుకుందాం.
* రెండు కప్పుల నీటిని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో రెండు స్పూన్ల యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ ను మరియు చెంచా తేనె వేసి వాటిని బాగా కలిసేలా స్పూన్ తో మిక్స్ చేసుకోవాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసుకోవాలి.  కుదుళ్ల చివర వరకు చేరేలా, పట్టేలా రాసుకోవడం మర్చిపోకండి. ఒక పది నిముషాలు ఆగి గోరు వెచ్చటి నీటితో శుభ్రం కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన జుట్టు మృదువుగా తయారవుతుంది.
*కోడి గుడ్డులోని తెల్ల సొన జుట్టు మృదువుగా తయారవడానికి అలాగే కాంతిగా కనిపించడానికి  ప్రముఖ పాత్ర పోషిస్తుందని తెలిసిందే. అయితే ఒక బౌల్ తీసుకొని గుడ్డు లోని తెల్ల సొనను తీసుకోవాలి.  ఇందులోకి ఇపుడు ఆరేడు చెంచాల వరకు పెరుగు వేసి బాగా కలపాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని జుట్టుకు కుదుళ్లకు పట్టించి, కనీసం 20 నిమిషాల పాటు అయిన బాగా ఆరనివ్వాలి. ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా కనీసం వారానికి ఒకసారైనా చేయడం ద్వారా మంచి ఫలితం లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: