వయసు పెరిగే కొద్దీ మీ ముఖంలో అందం తగ్గుతోందా?

VAMSI
అందం అనే మాట అంటే బహుశా ఇష్టపడని మనిషి ఈ లోకంలోనే ఉండరేమో..అంతగా అందం అంటే ఆసక్తి కనబరుస్తారు ప్రతి ఒక్కరూ. పడుచు వారైనా, ముసలి వారైనా ఎంతటి వారైనా అందం అంటే ఎంతో కొంత ఆసక్తి కనబరుస్తారు. అందంగా కనిపించడానికి చాలానే ప్రయత్నాలు చేస్తుంటారు. రకరకాల ఫేస్ క్రీములు, పేస్ వాష్ లు బాతింగ్ పౌడర్ లు వినియోగిస్తూ ఉంటారు. అందరిలోనూ అందంగ కనిపించాలని తహతహ లాడుతుంటారు. అయితే యవ్వనంలో ఎంత అందంగా ఉన్నా వయసు మీద పడుతున్నా కొద్ది అందం తరుగుతూ వస్తుంది. వయసు పెరుగుతున్నప్పుడు మన శరీరంలో వచ్చే మార్పులు వలన మన అందం మందగిస్తుంది.
ముఖ్యంగా ముఖంపై వచ్చే మార్పులు మన అందాన్ని మరింత తగ్గిస్తాయి. వయసు మీద పడితే చాలామందికి ముఖంపై ముడతలు రావడం మొదలౌతాయి. ముడతలు వచ్చిన ముఖంలో కాంతి తగ్గుతుంది. పట్టు కోల్పోయిన చర్మం అందాన్ని కూడా కోల్పోతుంది. అయితే మీరు అలా కాకూడదు అనుకుంటున్నారా... మీరు అందంగా కనిపించాలని కోరుకుంటున్నారా...??  ముడుతలు లేని.. రాని  చర్మం మీ సొంతం కావాలి అనుకుంటున్నారా అయితే ఈ సలహాలు పాటించండి అంటున్నారు నిపుణులు. అవేంటో ఓ సారి చూద్దాం పదండి. ముఖం పై ముడతలు రాకుండా ఉండటానికి ఎలా అయితే కొన్ని చిట్కాలు పాటించాలో అలాగే ముడతలు వచ్చేందుకు కారణమయ్యే అలవాటును కూడా మార్చి ఉన్నప్పుడే మీ ముఖం అందంగా కనిపిస్తుంది. ఆ అలవాట్లు, పద్ధతులు తెలుసుకొని వాటిని దూరం చేసుకోవడం ఉత్తమం.
* చక్కెర అధికంగా తీసుకోవడం వలన కూడా ముఖంపై ముడతలు కారణమవుతోందని అంటున్నారు. షుగర్ కారణంగా గ్లైకేషన్ ప్రక్రియలో ప్రమాదం అయినటువంటి ఫ్రీ-రాడికల్స్‌గా మార్చబడిన, కణాలను దెబ్బతీసి ముఖం ముడుతలు ఏర్పడడానికి కారణం అవుతుందని అంటున్నారు.
* చాలామంది పడుకున్నప్పుడు ముఖాన్ని పలుసార్లు వంటివి చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ముఖంపై ముడతలు వచ్చే అవకాశాలు ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు.
* ఎండలో తిరగడం వలన కూడా అధిక వేడి చేత చర్మంపై ముడుతలు ఏర్పడుతాయి.
* చర్మంపై తేమ అనేది చర్మ సౌందర్యానికి చాలా ముఖ్యం. కాబట్టి సహజసిద్ధమైన ప్రేమ కోసం నీటిని తగిన మోతాదులో తాగాలి. పండ్లు ఎక్కువగా తినాలి. అలాగే పొడిగా నైపిస్తే ముఖానికి మాయిశ్చరైజర్ ను వినియోగించడం మంచిదే అంటున్నారు. ఇలా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం వలన ముఖంపై ముడతలు త్వరగా రాకుండా అరికట్టవచ్చని నిపుణులు చెబుతున్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: