"పులిపిర్ల"తో ఇబ్బంది పడుతున్నారా ?

VAMSI
కొంత మంది చాలా అందంగా ఉంటారు కానీ ముఖం అందంగానే ఉన్నా మెడ దగ్గర లేదా భుజాల మీద పులిపిర్లు అనేవి ముఖం అందాన్ని హైలైట్ కాకుండా చేస్తాయి. చాలా మందికి కలిగే సాధారణ సమస్య. కానీ ఇది చాలా ఇబ్బందికరమైనది కూడా, పురుషులకన్నా కూడా ఎక్కువగా మహిళల్లో ఈ సమస్య వస్తుంటుంది. 25 సంవత్సరాలు దాటిన వారిలో ఎక్కువగా ఈ సమస్యను చూస్తుంటాము. కొందరయితే ఈ పులిపిర్లు కారణంగా నలుగురిలో తిరగడానికి ఇబ్బందిపడుతుంటారు. జుగుప్సాకరమైన రూపాన్ని కలిగిన ఇవి మన అందాన్ని తగ్గిస్తాయి. హ్యూమన్ పాపిలోమా అనేటటువంటి వైరస్ కారణంగా ఈ పురిపిర్లు ఏర్పడుతాయట. ఇవి ఎక్కువుగా మెడపై, ముఖం, పాదాలపై, చేతుల పై ఏర్పడుతుంటాయి. అయితే వీటిని తగ్గించుకోవడానికి ఇపుడు ఓ మంచి చిట్కాను తెలుసుకుందాం.
* వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిదని తెలిసిందే. అలాగే చర్మ వ్యాధులకు కూడా ఇదో అధ్బుతమైన చిట్కా.  
ఒక గిన్నెలో మూడు వెల్లుల్లి పాయలను మెత్తటి పేస్ట్ గా చేసి తీసుకోవాలి. అందులో పావు స్పూన్ బేకింగ్ సోడా, ఒక అర టీ స్పూన్ నిమ్మరసమును వేసి బాగా మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని పులిపిర్లు ఉన్న ప్రదేశంలో ముద్దగా రాసుకుని దానిపై  బ్యాండెజ్ వేయాలి. ఒక గంట ఆగి ఆ బ్యాండెజ్ తీసేసి శుభ్రంగా సోపుతో కడుక్కోవాలి. ఇలా కొద్ది రోజులు రెండు పూటలా చేస్తూ ఉంటే పులిపిర్లు వాటికవే  రాలిపోతాయి. ఈ సమస్యలు వెల్లుల్లి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది.
* అలాగే బేకింగ్ సోడా కూడా పులిపిరుల నివారణకు చక్కటి చిట్కా. కొద్దిగా బేకింగ్ సోడాను ఒక బౌల్ లోకి తీసుకుని అందులో కాస్త ఆముదం కలపాలి. ఆ మిశ్రమాన్ని పులిపిర్లపై రాసి దానిపై బ్యాండేజ్ వేయాలి. అలా ఓ గంట పాటు వదిలి తీసి కడిగేయాలి. ఇలా చేస్తే మెల్లగా మీ చర్మం పై పులిపిర్లు మాయమవుతాయి.
ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేసి చూడండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: