మీ పెదాలు నల్లగా ఉన్నాయా... ఈ చిట్కాలు మీ కోసం ?

VAMSI
చాలా మంది ముఖం అందంతో పాటు పెదవులు కూడా మంచి రంగును కలిగి అందంగా ఉండాలని ఆకాంక్షిస్తారు. ఆడవారైనా, మగవారైనా పెదవులు లేత గులాబీ రంగులో ఉండాలని కోరుకుంటుంటారు. అందుకోసం కొందరు రకరకాల లిప్ స్టిక్ లను వాడుతుంటారు. ఇంకొందరు పెదవులు అందంగా కనబడటం కోసం లిప్స్టిక్ వాడాలని ఉన్నా లిప్ స్టిక్ తో పబ్లిక్ ముందుకు వెళ్లలేక ఏం చేయాలా అని ఇబ్బందిపడుతుంటారు. ఇక మగవారైతే అసలు లిప్ స్టిక్ వాడరు. ఇలాంటి వారందరికీ పెదవుల్ని మంచి రంగులోకి ఎలా మార్చాలి అన్న ఆలోచన ఉండనే ఉంటుంది. అయితే ఇటువంటి వారంతా నిరుత్సాహ పడే అవసరంలేదు లిప్ స్టిక్ మాత్రమే వాడాల్సిన పనిలేదు. 

ఇంట్లో దొరికే కొన్ని పదార్థాలతో ఈ సమస్యను దూరం చేయవచ్చు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా శరీరంలో రక్తం తక్కువగా ఉన్నప్పుడు అనగా హిమోగ్లోబిన్ తక్కువ శాతంలో ఉన్నప్పుడు పెదవులు రంగును కోల్పోయి తెల్లగా కనిపిస్తుంటాయి. ఇలాంటి వారు పెదాల్ని ఎర్రగా మార్చుకోవాలి అనుకుంటే, అలాంటి వారు ముందుగా శరీరంలో హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. హిమోగ్లోబిన్ పెరిగితే ఆటోమేటిక్ గా చాలా మందికి పెదవుల రంగు కూడా మంచి ఎరుపు లోకి వస్తుంది. హిమోగ్లోబిన్ పెరిగినట్లయితే పెదవుల రంగు కూడా ఎర్రగా మారుతుంది.
* శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పెరగడానికి నిత్యం తోటకూరను రెగ్యులర్ గా తీసుకోవడం వలన శరీరం మొత్తానికి కావలసిన ఐరన్ ని తోటకూర ద్వారా పొందవచ్చు.
* లాలాజలంతో పెదాలను ఎక్కువగా తడుపుకుంటూ ఉండాలి. అంటే నాలుకతో పెదాలను చెమ్మ చేసుకోవాలి.
*పెదాలు పొడిబారి పగిలినట్టు అనిపించినా లేదా రఫ్ గా అనిపించినా నెయ్యిని రోజులో మూడు నాలుగు సార్లు పెదాలకు రాసుకోవాలి. ముఖ్యంగా రాత్రిపూట పడుకునే ముందు రాయడం వలన ఆ పగుళ్లు అనేవి తగ్గి పెదవులు మృదువుగా తయారవుతాయి. అలాగే మంచి రంగు లోకి వస్తాయి.
*ముఖ్యంగా నీటిని అధికంగా తాగాలి. రోజుకి అయిదు నుండి ఎనిమిది లీటర్ల నీటిని తాగాలి. నీరు మన శరీరంలో అన్ని భాగాలు ఆరోగ్యంగా ఉండడానికి అత్యంత అవసరం.  
* ఒక స్పూన్ పాలల్లో చిటికెడంత కుంకుమ పువ్వు పొడి మ‌రియు అర టీ స్పూన్ వరకు తేనె వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని పెదవులకు అప్లై చేసుకుని పది నిమిషాలు ఆగి కడిగేసుకోవాలి.
*బీట్ రూట్ జ్యూస్ కొద్దిగా తీసుకుని అందులో కొద్దిగా మీగడ వేసి బాగా కలిపి ఆ మిశ్రమం పెదవులపై బాగా మర్దన చేయాలి.
ఇలా చేయడం వలన మీ పెదాలు ఒక వరం రోజులలో మంచి రంగులోకి వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: