కోడిగుడ్డుతో ఇలా చేస్తే అందమైన జుట్టు మీ సొంతం..

Purushottham Vinay
రెండు కోడిగుడ్లుని అలాగే మూడు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ ను తీసుకుని అందులో కోడిగుడ్లు పగులగొట్టి ఒక బౌల్ లో పోసుకోవాలి.ఇక అలా ఆ బౌల్ లో పోసిన కోడిగుడ్ల సొన ఇంకా లోపలి పదార్థానికి ఆలివ్ ఆయిల్ ను కలపాలి.ఇక ఆ తరువాత ఈ రెండు పదార్థాలు బాగా కలిసే వరకు బాగా షేక్ చేయాలి.ఇలా బాగా కలిపిన ఆ మిశ్రమాన్ని తీసుకొని మీ జుట్టుకు అప్లై చేసుకోవాలి. ఇక అప్లై చేసుకునే ముందు ఒక విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ మిశ్రమం బాగా మిక్స్ అయిన తర్వాత మాత్రమే అప్లై తలకి అప్లై చేయాలి. మిశ్రమం బాగా మిక్స్ అవ్వక ముందు జుట్టుకు అప్లై చేయడం అంత మంచిది కాదు.ఇలా ఆలివ్ ఆయిల్ ఇంకా కోడిగుడ్ల మిశ్రమాన్ని మీ జుట్టుకు అప్లై చేసి దాదాపు ఒక గంట సేపు పాటు జుట్టును అలాగే ఉంచుకోవాలి. ఇలా ఒక గంట సేపు ఆ మిశ్రమాన్ని జుట్టుకే ఉంచుకోవడం వలన ఆ మిశ్రమం అనేది పూర్తిగా జుట్టుకు పడుతుంది.ఇక ఒక గంట సేపు గడిచిన తర్వాత జుట్టుకు అప్లై చేసిన ఆ మిశ్రమాన్ని చల్లటి నీటితో కడగాలి. ఇక అలాగే సల్ఫేట్ లేని షాంపూతో జుట్టును బాగా శుభ్రంగా కడుక్కోవాలి.

ఇక కోడిగుడ్లు ఇంకా ఆలివ్ ఆయిల్ మిశ్రమాన్ని మీ జుట్టుకు అప్లై చేయడం వలన జుట్టు చాలా స్మూత్ గా ఎలా తయారవుతుంది. ఈ మిశ్రమం మన జుట్టుపై చాలా అద్భుతంగా పని చేస్తుంది. ఎందుకంటే కోడిగుడ్లలో చాలా రకాల ప్రొటీన్లు అనేవి దాగి ఉంటాయి. అందువల్ల ఇవి మన జుట్టుకు ఎక్కువగా స్మూత్ నెస్ ను ఇస్తాయి. ఇక అంతే కాకుండా మన జుట్టును స్ర్టెయిట్ చేసేందుకు అలాగే ఇంకా మృదువుగా చేసేందుకు కూడా ఇవి బాగా సహకరిస్తాయి.ఎందుకంటే ఆలివ్ ఆయిల్ అనేది చాలా అద్భుతంగా పని చేసే ఒక హెయిర్ కండిషనర్. అందుకే ఈ రెండు మిశ్రమాలను కలిపి మన జుట్టుకు అప్లై చేయడం వలన మన జుట్టు ఎంతో స్మూత్ గా తయారవడం జరుగుతుంది. అలాగే ఇది చూసేందుకు కూడా ఎంతో అందంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఎటువంటి చిక్కుల సమస్య అనేదే ఉండదు.అందుకే ఈ విధానం కూడా ఎంతో సింపుల్ గా ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఈ విధానం ట్రై చేయడం కూడా చాలా సులుభమైన పద్ధతి. కాబట్టి ఖచ్చితంగా ట్రై చెయ్యండి. మంచి ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: