కొరియన్ అమ్మాయిల్లా మీరు కూడా అందంగా మారాలని ఉందా ?

VAMSI
మన దేశంలో ఎంతో మంది అందమైన అమ్మాయిలు ఉన్నారు. ఇదే విధంగా ప్రతి దేశంలో ఉంటారు. కానీ కొరియా దేశానికి చెందిన అమ్మాయిలు చాలా అందంగా ఉంటారని అందరికీ తెలిసిందే. అయితే వీరిలో అంత ప్రత్యేకత ఏముందో తెలియడం లేదు. ఈ దేశంలో అమ్మాయిలను ఒకసారి మీరు బాగా పరిశీలిస్తే వారి ముఖంలో ఏదో తెలియని షైనింగ్ ఉంటుంది. ఎదో తెలియని కళ వారి ముఖంలో వెలిగిపోతూ ఉంటుంది. ఈ కారణంగానే దేశ వ్యాప్తంగా కొరియా దేశం నుండి హీరోయిన్ లు కానీ, మోడల్స్ కానీ బాగా ప్రసిద్ది చెందారు. అయితే వీరి అందం వెనుక ఉన్న రహస్యం మరియు మాయ ఏమిటో తెలుసుకుందామా
వీరంతా కూడా రాత్రి సమయంలో తొందరగా నిద్ర పోతారట, అలాగే ఉదయాన్నే త్వరగా నిద్ర లేస్తారు. తద్వారా ఎక్కువ సమయం నిద్ర ఉంటుంది. ముఖం చాలా ఫ్రెష్ గా ఉంటుంది. రోజంతా తాజాదనం వారి ముఖంలో కనిపిస్తూ ఉంటుంది. వారి కళ్ళల్లో ఒక వెలుగు ఉంటుంది. అయితే వారి లాగా మీరు కనబడాలని అనుకుంటున్నారా. అయితే కొన్ని పద్దతులు అలవాటు చేసుకోవడం ద్వారా వారిలాగా మారే అవకాశం ఉందని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు.
మీరు ఉదయం నిద్ర లేవగానే మొదట చేయాల్సిన పని మంచి నీరుతో మీ ముఖాన్ని కడగాలి. ఎటువంటి ఫేస్ వాష్ వాడకూడదు. అంతే కాకుండా ముఖానికి టోనర్ ను అప్లై చేయాలి. దీనిని ఉపయోగించడం వలన ముఖంలో పీహెచ్ లెవెల్స్ పోకుండా ఉంటాయి.  మరియు మీ కంటి కింద ఉన్నం భాగంలో నల్లని వలయాలు పోయి మెరుపు రావాలంటే మామూలుగా అందరూ వాడే ఫేస్ క్రీమ్ లాంటివి కాకుండా, ప్రత్యేకమైన ఐ క్రీమ్ వాడాలి. ఇది వేసుకునే ముందు కంటికి తగలకుండా జాగ్రత్త పడాలి. ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎండ నుండి మీ ముఖ చర్మం పాడైపోకుండా ఉండడానికి సన్ స్క్రీన్ లోషన్ లాంటిది వాడటం ఉత్తమం. ఇది ముడతలు రాకుండా మీ చర్మాన్ని కాపాడుతుంది. ఇలా ప్రతి ఒక్కటి సరిగా పాటిస్తేనే మీరు అందంగా కనిపిస్తారు. లేదు ఇలా చేయడం మా వల్ల కాదు అనుకుంటే మీ ఇష్టం.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: