ఇలా చేస్తే మీ పెదాలు మృదువుగా అందంగా అవుతాయి..

Purushottham Vinay
మృదువైన ఇంకా అందమైన పెదాలకు పెట్రోలియం జెల్లీ చాలా మంచిది.ఈ పెట్రోలియం జెల్లీ మార్కెట్లో చాలా సులభంగా లభిస్తుంది.ఇది శీతాకాలంలో అందరి ఇంట్లో కూడా ఉంటుంది. పురుషులు కూడా దీనిని పెదాలకు వాడవచ్చు. మీరు ప్రతిరోజు కూడా నిద్రపోయే ముందు కొద్దిగా ఈ పెట్రోలియం జెల్లిని తీసుకొని పెదవులకు అప్లై చెయ్యాలి.ఇక దీనివల్ల పెదాలని బాగా హైడ్రేట్ చేయవచ్చు.అలాగే కొబ్బరి నూనెను అప్లై చేయడం వల్ల కూడా పెదాలను చాలా మృదువుగా మార్చుకోవచ్చు. ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెని పెదాలకి పూసి మెల్లగా బాగా మర్దన చేయండి. ఇలా చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.సూర్యరశ్మి ఇంకా బయట కాలుష్యం మన పెదాలను చాలా నల్లగా మారుస్తాయి. అలాగని మనం బయటకు రాకుండా ఉండలేం కాబట్టి అందువల్ల SPF 15 ఉన్న లిప్ బామ్‌ను పెదాలకు రాసుకోవడం చాలా మంచిది. ఇది తేమను లాక్ చేయడంలో మీకు ఎంతగానో సహాయపడుతుంది.

ఇక అంతేకాకుండా సూర్యుని UV కిరణాల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.అలాగే పెదవులు పగలకుండా ఉండాలంటే ఎక్కువగా నీరు తాగడం అవసరం. శరీరం హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా అవసరం.మీరు డీహైడ్రేట్ అయితే మీ పెదవులు కూడా తడి ఆరిపోవడం జరుగుతుంది. అందుకే రోజూ కూడా శరీరానికి తగినంత నీరు తాగాలి.ఇక పెదవులు ఎల్లప్పుడూ మృదువుగా అందంగా ఉండటానికి 1 స్పూన్ నెయ్యి, ఇంకా 1/2 స్పూన్ దుంప రసం అలాగే 2 చుక్కలు జోజోబా ఆయిల్ తీసుకొని ఈ మూడింటిని బాగా కలపాలి. ఇక ఆ మిశ్రమాన్ని వేళ్లతో నెమ్మదిగా పెదవులపై బాగా రుద్దాలి.ఇలా కనీసం 2 నిమిషాల పాటు పెదాలను బాగా మసాజ్ చేయాలి. అందువల్ల మీ పెదవులు ఎంతో మృదువుగా ఉంటాయి. ఇక ఇలా మంచి ఫలితాల కోసం వారానికి రెండుసార్లు చేస్తే సరిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: