బాదంతో ఈ ప్యాక్ ని ట్రై చేస్తే అందమే అందం..

Purushottham Vinay
ఇక మిల మిల మెరిసే చర్మానికి బాదం పప్పు  ఎంతగానో సహాయపడుతుంది. బాదం పప్పుని ప్రతి రోజూ కూడా తినడం వల్ల ఆరోగ్యం బాగా మెరుగుపడుతుందని మనకు తెలుసు. కానీ అదే బాదం పప్పు చర్మాన్ని ఎంతో ప్రకాశవంతంగా చేయడానికి కూడా బాగా సహాయం చేస్తుంది. కాబట్టి .. బాదం పప్పుతో చేసిన ఫేస్ ప్యాక్ ని రోజూ వేసుకోవడం వల్ల చాలా అందంగా మెరవచ్చు. ఇక ఈ బాదం, నలుగు పిండి ముఖ తేజస్సు ఇంకా నిగారింపులకు ఏవిధంగా సహాయపడతాయో ఒకసారి తెలుసుకోండి.ఇక బాదం ఫేస్ ప్యాక్ ని వేయడం వల్ల ముఖం పై మడతలు అనేవి పూర్తిగా తగ్గిపోతాయి. అలాగే చర్మంపై వుండే నల్లని మచ్చలు కూడా చాలా ఈజీగా తొలగిపోతాయి. దీని వల్ల చర్మం బాగా కాంతివంతంగా ఇంకా యవ్వనంగా మెరుస్తుంది. రాత్రి వేళల్లో నాలుగు లేదా ఐదు బాదం పప్పులను తీసుకొని వాటిని పాలల్లో వేసి బాగా నానపెట్టాలి.ఇక తరువాత రోజున వాటి పొట్టుని తీసేసి పాలల్లో బాగా మరగనివ్వాలి. ఆ తర్వాత వాటిని మెత్తని పేస్టులాగా చేసుకోవాలి. దీనిని రాత్రిపూట ముఖానికి బాగా రాసుకోవాలి. ఇక తెల్లారిన తర్వాత ముఖాన్ని బాగా శుభ్రంగా కడిగేసుకోవాలి.

ఇలా వారానికి మూడు లేదా నాలుగు సార్లు కనుక చేస్తే .. ఖచ్చితంగా మీ ముఖం ఎంతో కాంతివంతంగా కళ కళ మెరిసిపోతుంది.అలాగే మరో పద్దతి ఏంటంటే. కొన్ని రకాల పప్పు ధాన్యాలను పిండిగా మార్చి దాన్ని వాడాలి. ఇక ఆయుర్వేదంలోనూ దీనికి మంచి ప్రాధాన్యం అనేది కల్పించారు. ఇక ఆయుర్వేదం ప్రకారం చూసుకున్నట్లయితే మీ శరీర తత్వానికి అనుగుణంగా నలుగు పిండిని మీరు తయారు చేసుకోవాలి. అప్పుడే మీ చర్మం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఇక సాధారణంగా ఆయుర్వేదంలో వాతం, పిత్తం ఇంకా కఫం అనే మూడు దోషాలకు వాడే ఔషధాలను ఇస్తారు. ఇదే సూత్రం చర్మ సౌందర్యానికీ కూడా వర్తిస్తుంది. సాధారణంగా నలుగు పిండిని శెనగపిండి, పసుపు ఇంకా పాలు వంటి వాటితో తయారు చేస్తారు. అయితే ఈ మధ్య కాలంలో శెనగపిండి, చందనం, పాలు ఇంకా పాలపొడి అలాగే బాదం పొడి ఇంకా మిల్క్ క్రీం, నిమ్మరసం, రోజ్ వాటర్ ఇంకా పసుపు లాంటి పదార్ధాలతో తయారు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: