అధిక బరువుని తగ్గించే సింపుల్ టిప్స్..

Purushottham Vinay
చాలా మంది అధిక బరువు సమస్యతో చాలా బాధపడుతూ వుంటారు. అలాంటి వారు ఖచ్చితంగా ఈ పద్ధతులు పాటించాలి. ఇక స్కిప్పింగ్‌తో శరీరానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. స్కిప్పింగ్ మన శరీరానికి మంచి చక్కని వ్యాయామం అందిస్తుంది. మనకు కుదిరినప్పుడు ఎప్పుడైనా సరే ఈ వ్యాయామం చేయవచ్చు. ఇక దీని కోసం మీకు ప్రత్యేకంగా ఎలాంటి పరికరాలు అనేవి అవసరం లేదు. కేవలం ఒక స్కిప్పింగ్ తాడు అనేది ఉంటే చాలు. దీనితో మీ బాడీ మొత్తానికి మంచి వ్యాయమం దొరుకుతుంది. ఇక అలాగే మన శరీరంలోని కొవ్వు కరిగేందుకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.అలాగే వర్కౌట్ బ్యాండ్‌ల సహాయంతో కూడా మీరు చాలా కాలం పాటు కఠిన వ్యాయామాలు అనేవి చేయవచ్చు. స్క్వాట్స్ ఇంకా సైక్లింగ్ చేస్తున్నప్పుడు ఈ బ్యాండ్‌ను మనం ఉపయోగించవచ్చు. అలాగే స్ట్రెచింగ్, ట్రైనింగ్ ఇంకా ఇతర వ్యాయామాల కోసం రెసిస్టెన్స్ బ్యాండ్‌లను బాగా ఉపయోగించవచ్చు.అలాగే వీటి సహాయంతో కొవ్వును చాలా త్వరగా కరిగించవచ్చు.

ఇక స్ట్రెచింగ్ ఇక ఆ తర్వాత ఏరోబిక్‌ అలాగే స్ట్రెంగ్త్‌ వ్యాయామాలు మరియు జాగింగ్‌ ఇంకా విశ్రాంతితోపాటు ఇలా అన్ని రకాల వ్యాయామాలను పూర్తి చేసేలా బాడీకి వ్యాయామాన్ని అందించడాన్ని సర్క్యూట్‌ ట్రైనింగ్‌ అంటారు. ఈ సర్క్యూట్ ట్రైనింగ్‌తో శరీరానికి మంచి వ్యాయమం అనేది బాగా దొరుకుతుంది. అలాగే చాలా ఈజీగా కొవ్వును కూడా కరిగించుకోవచ్చు. ఇక ఇందులో పుష్ అప్‌లు, లంగ్స్, పుల్ అప్‌లు ఇంకా స్కిప్పింగ్ కూడా ఉంటాయి. ఇక వారమంతా ఈ వ్యాయమం చేయడం ద్వారా 500 నుంచి 600 కేలరీలను ఈజీగా కరిగించుకోవచ్చు.ఇక అలాగే ఉప్పు నీటి నిలువను బాగా పెంచుతుంది. బరువుని తగ్గించడానికి ఆహారంలో సోడియం చాలా తీసుకోవడం తగ్గించాలి. ఆహారంలో రుచిని పెంచడానికి మూలికలు ఇంకా సుగంధ ద్రవ్యాలను ఉపయోగించవచ్చు. ఇవి శరీరం నుంచి అదనపు నీటిని తొలగించేందుకు ఎంతగానో సహాయపడతాయి.కాబట్టి ఖచ్చితంగా ఈ పద్ధతులు పాటించండి. అధిక బరువుని చాలా ఈజీగా తగ్గించుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: