ముఖానికి పసుపు వాడుతున్నారా? అయితే ఈ తప్పులు చెయ్యొద్దు..

Purushottham Vinay
చర్మ సౌందర్యాన్ని పెంచడంతో పసుపు చాలా అద్భుతంగా పని చేస్తుంది. కానీ కొంతమంది దానికి అదనంగా ఏవేవో మిక్స్ చేస్తుంటారు. అలాగ ఎక్కువగా పసుపును రోజ్ వాటర్, పాలు, నీటితో బాగా కలుపుతారు. కానీ కొంతమంది అనవసరమైన పదార్థాలను పసుపుకు జత చేస్తారు. దీని ఫలితంగా ముఖ చర్మం బాగా దెబ్బతింటుంది. అందుకే పసుపులో ఏది పడితే అది కలుపకూడదు.ఇక పసుపు మీ చర్మానికి చాలా మేలు చేస్తుంది. పసుపు పేస్ట్ ను ముఖానికి అప్లై చేయడం ద్వారా ముఖం లేత పసుపు రంగులోకి మారి బాగా కనిపిస్తుంటుంది.ఇక ముఖానికి పసుపు పేస్ట్ ఎంతసేపు ఉంచుకోవాలనే దానిపై బాగా దృష్టి పెట్టాలి. 20 నిమిషాల కన్నా ఎక్కువ సేపు ఈ ప్యాక్‌ను ఉంచుకోకూడదు.ఇక పసుపును ఎక్కువసేపు ముఖంపై ఉంచుకుంటే..ఇక దాని రంగు అలాగే ముఖానికి అంటుకుపోతుంది. అందుకే 20 నిమిషాల తరువాత వెంటనే ముఖాన్ని కడిగేయాలి.
ఇక అంతేకాదు.. పసుపును అధిక పరిమాణంలో ముఖానికి రాసుకోవడం వల్ల మొటిమలు కూడా వచ్చే ప్రమాదం చాలా ఉంది.ఇక చాలా మంది కూడా తొందరలో పసుపు ఫేస్ ప్యాక్‌ను ముఖానికి సరిగా అప్లై చేసుకోరు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి తప్పులను సరిచేసుకోవాలి. అది సరిగ్గా అప్లై చేయకపోతే..ఇక ముఖానికి ఎంత పసుపు పెట్టినా ఉపయోగం ఉండదు.ఇక పసుపు పేస్ట్‌ని సరిగ్గా అప్లై చేయకపోతే.. ప్యాచెస్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఇక అలాగే అక్కడక్కడ మరకల మాదిరిగా కనిపిస్తుంటాయి. అందుకే ఇలాంటి పొరపాటు చేయకుండా చాలా జాగ్రత్త పడాలి.ఇక ముఖానికి ఫేస్ ప్యాక్ వేసిన తరువాత చాలా మంది సబ్బుతో కడుగుతారు. ఇక అలాంటి తప్పులు చేయొద్దని నిపుణులు వెల్లడిస్తున్నారు.పసుపు ఫేస్ ప్యాక్ ని తొలగించిన తరువాత.. 24 గంటల నుంచి 48 గంటల వరకు సబ్బును వాడకూడదని నిపుణులు గట్టిగా చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: