మీ పళ్ళు పచ్చగా ఉన్నాయా? అయితే ఇలా చెయ్యండి..

Purushottham Vinay
ఇక అందంగా కనపడాలంటే ముఖం మాత్రమే అందంగా ఉంటే సరిపోదు.నవ్వు కూడా అందంగా ఉండాలి. అందమైన నవ్వు కావాలంటే మిల మిల మెరిసే పళ్ళు కూడా ఉండాలి. ఇక చాలా మందికి కూడా పళ్ళు ఎంత తోమిన కాని పచ్చగా ఉంటాయి. ఇక పళ్ళు తెల్లగా నిగ నిగ లాడటానికి స్ట్రా బెర్రి ఎంతగానో సహాయపడుతుంది. ఇక స్ట్రాబెర్రీలోని ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలు చర్మం అందంగా ఉండటానికి ఇంకా పళ్ళు తెల్లగా అవ్వడానికి ఎంతగానో సహాయపడతాయి. ఇవి చర్మంలోని మృత కణాలను పూర్తిగా తొలగించి చర్మం శుభ్రపడడానికి ఇంకా రంగు పెరగడానికి సహాయపడతాయి. అందుకని చర్మం పొడిబారినప్పుడు స్ట్రాబెర్రీలను పేస్ట్ చేసి చర్మానికి ప్యాక్ లా వేసుకుంటే చక్కటి ఫలితం అనేది ఉంటుంది.ఇక అలాగే మన దంతాలు కూడా శక్తివంతంగా తెల్లగా మెరిసేలా చేస్తాయి.

ఇక స్ట్రాబెర్రీల్లో ఉన్న మాలిక్ ఆమ్లం దంతాలను తెల్లగా మార్చడానికి చక్కగా పని చేస్తుంది. కాబట్టి స్టాబెర్రీలను ఎప్పుడు తినడమే కాదు.. వీటిని బాగా ముక్కలుగా గార పట్టిన దంతాలపై వ్యతిరేకంగా ముందుకు వెనుకకు రుద్ది ఆ తర్వాత నోటిని శుభ్రం చేసుకోండి.మంచి ఫలితం మీ సొంతమవుతుంది.ఇక చర్మానికి అలాగే పళ్లకు హాని కలిగించే సూర్య కిరణాల నుంచి స్టాబెర్రీ రక్షిస్తుంది. ఇక ఎల్లాజిక్ ఆమ్లం ఇంకా ఆంథోసైనిన్ సహా అనేక యాంటీఆక్సిడెంట్లు స్టాబెర్రీలో చాలా అధికంగా ఉన్నాయి. ఇక ఇవి చర్మాన్నీ సూర్యకిరణాల నుంచి మంచి రక్షణ ఇస్తాయి.ఇక స్త్రా బెర్రి అనేక చర్మ సంరక్షణ ఉత్పత్తులలో ఉపయోగించబడుతున్నది. ఇంకా సాలిసిలిక్ ఆమ్లం స్ట్రాబెర్రీలో పుష్కలంగా ఉంది. ఇది బీటా హైడ్రాక్సీ ఆమ్లం ఇంకా హైపర్ పిగ్మెంటేషన్ అలాగే నల్లటి మచ్చలను తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది.కాబట్టి చర్మాన్ని ఇంకా పళ్ళని ఆరోగ్యంగా అందంగా వుంచుకోవడానికి స్త్రాబెర్రిని ఉపయోగించండి. చక్కటి ఫలితం తక్షణమే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: