ఈ టిప్స్ తో ముఖంపై దుమ్ము, ధూళి మటుమాయం..

Purushottham Vinay
మగవాళ్ళు అందంగా ఎప్పుడు మెరుస్తూ ఉండటానికి ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించండి. ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.కొంచెం ఆలీవ్ ఆయిల్ అలాగే ఒక టీస్పూన్ తేనె ఇంకా ఒక టీస్పూన్ కాఫీ పొడిని ఒక గిన్నెలోకి తీసుకుని వాటిని బాగా కలపి ఈ మిశ్రమాన్ని ఫేస్ కు మృదువుగా అప్లై చేయండి. అప్లై చేసిన తరువాత ఒక్క 15 నిముషాలు దాకా ఆరనివ్వండి.ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోండి. ఇక రోజూ ఇలా చేస్తే ఒక వారం రోజులకే మంచి రిజల్ట్ తెలుస్తుంది.అలాగే మీ చర్మ కణాలు తొలగి మీ చర్మం ఎంతో తాజాగా ఇంకా మృదువుగా అవుతుంది.ఇక అలాగే మొటిమలు బాగా ఇబ్బంది పెడుతుంటే.. వేప ఆకులను పేస్ట్ ను తీసుకుని ఆ పేస్ట్ లో గంధపు పొడి, బాదం పొడి అలాగే పసుపు పొడి వేసి బాగా కలిపి ఈ పేస్ట్ ను ముఖానికి బాగా అప్లై చేయాలి.ఇక ఈ మిశ్రమం తడిపొడిగా ఉన్న సమయంలోనే గోరువెచ్చని నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి.

ఇక ఆ తరువాత ముఖం ఎంతో ప్రకాశవంతంగా అలాగే తాజాగా కనిపిస్తుంది.ఇక ముఖం బాగా పొడిబారుతుంటే నిమ్మరసంలో కొద్దిగా తేనెను కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోండి. ఇక ఆ తరువాత ఒక 15 నిముషాల తర్వాత ముఖాన్ని బాగా కడిగేసుకోవాలి.ఇక దుమ్ము ధూళి అంత తొలగించుకొని ముఖాన్ని బాగా తాజాగా ఉంచడానికి అనాస పండు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.ఇక పైనాపిల్ ముక్కతో ముఖాన్ని బాగా రుద్ది తర్వాత మీ ముఖాన్ని చల్లటి నీటితో కడగాలి.ఇక ఇలా క్రమం తప్పకుండా చేస్తే మీ ముఖం ఎంతో ప్రకాశవంతంగా మారుతుంది.ఇక పచ్చి బొప్పాయిని బాగా పేస్ట్‌ చేసుకుని ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసిన తరువాత కొంచెం సేపు బాగా ఆరనివ్వాలి.ఇక ఆ తరువాత కొంచెం గోరువెచ్చని నీటితో ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: