జుట్టుకు ఏ రకం నూనె ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసా..!

Divya

వారానికి మూడు సార్లు జుట్టుకు నూనె పెట్టాలని అంటూ ఉంటారు. ఇలా జుట్టుకు వారానికి మూడు సార్లు నూనె పెట్టడం వల్ల జుట్టు ఆరోగ్యంగా నిగనిగలాడుతూ ఉంటుంది. ఇందుకోసం రకరకాల నూనెలను సూచిస్తూ ఉంటారు. అయితే ఏ రకం నూనె ఏరకంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..

కొబ్బరి నూనె :
జుట్టు సంరక్షణలో కొబ్బరి నూనె ప్రధానమైనది. కొబ్బరి నూనెలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వెంట్రుకల మూలాలకు శక్తిని అందిస్తాయి. జుట్టు ఒత్తుగా ఆరోగ్యంగా పెరగాలి అంటే, అందులో కొబ్బరి నూనె మొదటి పాత్ర వహిస్తుంది.  కొబ్బరినూనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టిస్తే జుట్టు నిగనిగలాడుతూ మెరుస్తూ ఉండడమే,  కాకుండా ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.

ఆవనూనె :
మందపాటి,నల్లటి జుట్టు పొందాలంటే ఆవ నూనె తో మాత్రమే సాధ్యం. ఆవనూనె తలలో రక్త ప్రసరణ పెంచి జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.

బాదం నూనె :
ఈ బాదం నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా లభిస్తుంది. కొబ్బరి, ఉసిరి నూనె లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. జుట్టు త్వరగా పెరగాలంటే, బాదం నూనె పట్టించడం శ్రేయస్కరం.

ఆముదం నూనె :
ఆముదం నూనెను కూడా జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు కుదుళ్ల లో రక్త ప్రసరణ బాగా జరిగి, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.  అయితే వారానికి రెండుసార్లు ఆముదం నూనెను కొబ్బరి నూనెలో కలిపి పట్టించు కోవడం వల్ల మంచి ప్రయోజనాలను పొందవచ్చు.
మందారం నూనె:
కేశాలను మొదళ్ల నుంచి బలోపేతం చేస్తుంది. ఎండలో తిరగడం వల్ల, కాలుష్యం కారణంగా, దుమ్ము,ధూళి కారణంగా జుట్టు నల్లగా మారుతుంది. అలాంటప్పుడు ఈ మందార నూనెను తలకు పట్టించడం వల్ల జుట్టు నల్లగా మారుతుంది.

బృంగరాజ్ నూనె:
ఈ నూనెతో తల కుదుళ్ల మీద మర్దనా చేయడం వల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా చుండ్రు వంటి సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: