అసలైన అందానికి సిసలైన ఆర్గానిక్ ఫేస్ మాస్క్..!
అయితే మనం వాడే ఫేస్ మాస్క్ ఏదైనప్పటికీ, అది ఆర్గానిక్ గా ఉండేలా చూసుకోవడం ఉత్తమం. మనకు అందం కావాలంటే మాత్రం ఓపిక కంపల్సరిగా తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎంత ఓపికగా మనం ఆర్గానిక్ ఫేస్ మాస్క్ లను ఉపయోగిస్తామో,అంతే త్వరగా ఫలితం కూడా అందుతుంది. అయితే ఎలాంటి ఆర్గానిక్ ఫేస్ మాస్క్ లు చర్మానికి ప్రయోజనాన్ని చేకూర్చుస్తాయో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..
మనం ఇంట్లో దొరికే కొన్ని పదార్థాల ద్వారా అందంగా తయారవ్వచ్చు. మరీ ముఖ్యంగా వీటి వల్ల మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అంతేకాదు తక్కువ ధరకే ఎక్కువ అందాన్ని, చర్మాన్ని శుభ్రపరిచి, నిగనిగలాడేలా చేస్తుంది. ఇందుకోసం మనకు కావలసిన పదార్థాలు..ముల్తానీ మట్టి లేదా చవిటి మన్ను 3 టేబుల్ స్పూన్లు, పసుపు ఒక టేబుల్ స్పూన్, పెరుగు ఒక టేబుల్ స్పూన్, తేనె ఒక టేబుల్ స్పూన్..
వీటన్నింటినీ బాగా కలిపి, అందులో కొన్ని గులాబీ రేకులను వేయాలి. ఒక అరగంట సేపు ఈ మిశ్రమాన్ని నానబెట్టాలి. ఆ తర్వాత ముఖానికి,మెడకు, భుజాలకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఉంచి తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం సహజంగా అందాన్ని పుంజుకుంటుంది. చర్మం మీద ఉన్న మృతకణాలు తొలగిపోయి,చర్మానికి తగినంత తేమ అందుతుంది. వారానికి రెండు సార్లు ఈ పేస్ ప్యాక్ ఉపయోగించడం వల్ల చర్మం తాజాగా, అందంగా, నిగనిగలాడుతూ ఉంటుంది.