కార్ ఇన్సూరెన్స్ ఇలా ఈజీగా తగ్గించుకోండి?

Purushottham Vinay
ప్రస్తుతం కాలంలో ప్రతి ఒక్కరూ కూడా కారు కలిగి ఉండాలని కోరుకుంటారు.కానీ ఇందులో కొంతమంది నిత్యావసరాల కోసం వినియోగిస్తే, మరి కొందరు లగ్జరీ కోసం  స్టేటస్ కోసం వినియోగిస్తారు.అయితే ఎవరు ఎలా ఉపయోగించుకున్నా.. ఆ కారుకి భీమా చేయించుకోవడం తప్పనిసరి. కానీ చాలామంది వాహన వినియోగదారులు భీమా అనేది అనవసరమని, అది ఖర్చుతో కూడుకున్నదని అనుకుంటారు. కానీ ఖరీదైన భీమాలు ఉన్నప్పటికి కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే కొన్ని ప్రీమియం పాలసీలు కూడా అందుబాటులో ఉన్నాయి.వాహన వినియోగదారులు కొత్త టిప్స్ తెలుసుకోవడం వల్ల తప్పకుండా మీ భీమా పాలసీని చాలా తక్కువకే పొందవచ్చు. ఇంకా అలాగే డబ్బు కూడా ఆదా చేయవచ్చు.ఈ టిప్స్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.నిజానికి కొత్త కారుకంటే కూడా పాత కారుకి భీమా ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల పాతకారు కోసం తప్పకుండా థర్డ్ పార్టీ లేదా సమగ్ర బీమా తీసుకోవచ్చు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌లో మీ కారుకు ఎలాంటి కవరేజీ అందించబడదు, అయితే సమగ్ర బీమాలో కంపెనీ థర్డ్ పార్టీతో పాటు సొంత డ్యామేజ్ కవరేజీని అందిస్తుంది.


మీ కారులో యాంటీ థెఫ్ట్ డివైజెస్ ఇన్‌స్టాల్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే దానిపై కూడా కారు బీమా ఆధారపడి ఉంటుంది. అప్డేటెడ్ యాంటీ థెఫ్ట్ డివైజెస్ ఉండటం వల్ల దొంగిలించబడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల కారు  సేఫ్టీ ఫీచర్స్ పరిగణనలోకి తీసుకుంటే, బీమా కంపెనీ మీ నుంచి తక్కువ ప్రీమియం వసూలు చేస్తుంది. మీరు కారులో యాంటీ థెఫ్ట్ డివైజెస్, గేర్‌లాక్‌లు లేదా స్టీరింగ్ లాక్‌ వంటి వాటిని ఇన్‌స్టాల్ చేసి ఉంటే, అప్పుడు కారు దొంగిలించబడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, తక్కువ ప్రమాదాన్ని పరిగణనలోకి తీసుకుని, బీమా కంపెనీ ప్రీమియంను తగ్గిస్తుంది.ప్రస్తుతం ఇండియాలో మోడిఫైడ్ కార్లకు చాలా మంచి గిరాకీ ఉంది.


 ఎక్కువమంది మాడిఫైడ్ కార్లను వినియోగించడానికి ఆసక్తి చూపుతారు. మోడిఫైడ్ కార్ల విలువ సాధారణ కార్ల కంటే కూడా ఎక్కువగా ఉంటుంది, కానీ కారు విలువ పెరిగే కొద్దీ భీమా ప్రీమియం కూడా అమాంతం పెరుగుతుంది. అందువల్ల అవసరమైతే తప్పా కారు మోడిఫికేషన్ చేయకూడదు.మీ కారు బీమా పాలసీ తీసుకునేటప్పుడు.. మీ పాలసీకి యాడ్ ఆన్ కవర్లను యాడ్ చేసుకునే సదుపాయం ఉంటుంది. ఆ సమయంలో మీరు ఎంచుకునే యాడ్ ఆన్ కవర్లను బట్టి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో జీరో డిప్రిసియేషన్ కవర్, టైర్ ప్రొటెక్ట్ కవర్, ఇంజిన్ ప్రొటెక్ట్ కవర్, గ్యారేజ్ క్యాష్ వంటివి ఉన్నాయి. నిజానికి మీరు ఎన్ని యాడ్-ఆన్ కవర్‌లను జోడిస్తే, మీ ప్రీమియం అంత ఖరీదైనదిగా మారుతుంది, కావున మీకు తప్పనిసరి అనుకున్నవి కాకుండా మిగిలినవి తొలగించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: