ఆధార్‌ డీటెయిల్స్ వేరొకరికి తెలిస్తే ఏమవుతుంది?

Purushottham Vinay
ఆధార్‌ చాలా ముఖ్యమైనది. ముఖ్యమైన పత్రాల్లో ఆధార్‌ ఒకటి. ఇది లేనిది ఏ పని జరగదు. ప్రభుత్వ, ప్రైవేటు అవసరాలతో పాటు ఇతర చిన్న పనులకు కూడా ఆధార్‌ కార్డ్ తప్పనిసరి అయ్యింది.మీ ఆధార్ నంబర్, పుట్టిన తేదీ, చిరునామా లీక్ అయితే బ్యాంక్ ఖాతా హ్యాకింగ్ అయ్యే ప్రమాదం ఉండదు. అయినప్పటికీ, లైబ్రరీలు, సైబర్ కేఫ్‌లు, హోటళ్లు మొదలైన వాటిలో పబ్లిక్ కంప్యూటర్‌లలో బ్యాంకింగ్ చేయడం మానుకోవాలి. ఇంకా పనిని పూర్తి చేసిన వెంటనే లాగ్ ఆఫ్ అవ్వాలి.చికాగోకు చెందిన సైబర్ సెక్యూరిటీ కంపెనీ OneSpan, SAARC రీజియన్ కంట్రీ మేనేజర్ పినాకిన్ డేవ్ మాట్లాడుతూ.. బ్యాంకింగ్, ఆర్థిక సంస్థలు కస్టమర్ ఇంటర్నెట్ భద్రతతో సంబంధం లేకుండా సురక్షిత బ్యాంకింగ్ కోసం సర్టిఫికేట్ పిన్నింగ్ వంటి భద్రతా ప్రోటోకాల్‌లను అమలు చేస్తున్నాయని చెప్పారు. అదేవిధంగా మీ ఆధార్ నంబర్ మాత్రమే తెలిసిన తర్వాత హ్యాకర్లు మీ బ్యాంక్ ఖాతా నుండి డబ్బును తీసుకోలేరు.


ఇతర సేవలను యాక్సెస్ చేయలేరని అన్నారు.మీ ఆధార్ నంబర్ తెలుసుకోవడం వల్ల మీ బ్యాంక్ ఖాతాను హ్యాక్ చేయలేరు. కానీ అది దుర్వినియోగం చేయవచ్చు. ఇ-ఆధార్ అనేది మీ భౌతిక ఆధార్ కార్డ్ ఎలక్ట్రానిక్ కాపీ. ఇది అనేక సేవలకు కేవైసీ చెల్లుబాటు అయ్యే రుజువు. అందుకే మీరు యూఐడీఏఐ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వడానికి, మీ ఇ-ఆధార్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి సైబర్ కేఫ్‌లను ఉపయోగిస్తుంటే మీరు సైబర్ సెక్యూరిటీ రిస్క్‌లో పడవచ్చు.ఆధార్‌ కోసం వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయితే సిస్టమ్ నుండి లాగ్ అవుట్ అవ్వాలని, డౌన్‌లోడ్ చేసిన అన్ని కాపీలను శాశ్వతంగా తొలగించాలని నిర్ధారించుకోండి. మీరు చేయకపోతే మోసగాళ్లు బొటనవేలు ముద్రలు, బయోమెట్రిక్ డేటా, ఇతర వివరాలతో సహా మీ సమాచారాన్ని దొంగిలించవచ్చు. వారు డిజిటల్ ఫింగర్ ప్రింట్స్ ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వివిధ పద్ధతుల ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: