నిలిచిపోయిన ఇన్నోవా క్రిస్టా కార్లు?

Purushottham Vinay
వరల్డ్ నెంబర్ వన్ ఆటోమొబైల్ కంపెనీ అయిన టొయోట తన డీజిల్ ఇన్నోవా క్రిస్టా కార్ల అమ్మకాలను కంపెనీ నిలిపివేసింది.బుకింగ్స్ కూడా తీసుకోవడం లేదు. అంతేకాదు.. ఇప్పటికే ఆ కార్ల కోసం బుక్ చేసుకున్న కస్లమర్లనూ పెట్రోల్ క్రిస్టా తీసుకోవాలని కోరుతుందట. ప్రస్తుత పరిస్థితుల్లో డీజిల్ కారుతో పోల్చితే పెట్రోల్ క్రిస్టా కారు ధర తక్కువగా ఉందని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుందట. అయితే కస్టమర్లు మాత్రం తమకు డీజిల్ కార్లు మాత్రమే కావాలని పట్టుబడుతున్నారట. పెట్రోల్ కార్లు కొనుగోలు చేసేందుకు వెనుకాడుతున్నారట. వాస్తవానికి డీజిల్ క్రిస్టా ధరలు పెంచినప్పటికీ వినియోగదారులు వాటినే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఏమాత్రం ఆదరణ తగ్గలేదు. ఇంత బాగా అమ్మకాలు కొనసాగుతున్నా డీజిల్ క్రిస్టా బుకింగ్స్ కంపెనీ ఎందుకు నిలిపివేసింది? అనేది కస్టమర్లకు అర్థం కావడం లేదు.టెంపరరీగా అమ్మకాలు నిలిపివేసిన టయోటా ఇన్నోవా క్రిస్టా 147 hp, 360 Nm టార్క్‌ను విడుదల చేసే 2.4-లీటర్ డీజిల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంది. మరోవైపు, పెట్రోల్ వేరియంట్‌లు 164 bhp, 245 Nm మాక్సిమం టార్క్‌ను ప్రొడ్యూస్ చేసే 2.7-లీటర్ ఇంజన్‌ను కలిగి ఉన్నాయి. టయోటా ఇన్నోవా క్రిస్టాతో 2.8-లీటర్ డీజిల్ ఆటోమేటిక్‌ను కూడా అందించింది. అయితే 2020లో దీని అమ్మకాలు నిలిచిపోయాయి.


దేశీయ మార్కెట్లో ఎక్కువగా అమ్ముడవుతున్న టయోట వాహనాల్లో డీజిల్‌ ఇన్నోవా క్రిస్టానే టాప్. నెలకు 7 వేల 900 కార్లును అమ్ముతుంది. సెకెండ్ జెనరేషన్ క్రిస్టా ఇప్పటికే భారత్ లో మిలియన్ యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇంత మంచి సేల్స్ ఉన్న కార్ల అమ్మకాలను కంపెనీ తాత్కాలికంగా నిలిపివేయడం పట్ల వినియోగదారులు షాక్ అవుతున్నారు. డీజిల్ ఇన్నోవా క్రిస్టా బుకింగ్స్‌ ఎందుకు నిలిపివేశారో కంపెనీ క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఆటో నిపుణులు మాత్రం సెమీ కండక్టర్ల షార్టేజ్ కారణంగానే నిలిపివేస్తున్నట్లు భావిస్తున్నారు. ఇన్నోవా క్రిస్టా ఇతర వేరియంట్లు యథావిధిగా అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది.ప్రస్తుతం ఇన్నోవా క్రిస్టా ధర ₹17. 45 లక్షల నుంచి ₹23. 83 లక్షల మధ్య కొనసాగతున్నది. MPV ఆరు, ఏడు సీట్ల కాన్ఫిగరేషన్‌లతో అందుబాటులో ఉంది. ఇది ప్రీమియం MPVలో స్లాట్ చేయబడింది. ఈ కారు హ్యుందాయ్ అల్కాజార్, కియా కారెన్స్, మారుతి సుజుకి XL6 కార్లతో పోటీ పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: