PM కిసాన్: 12వ విడత జమ ఎప్పుడంటే?

Purushottham Vinay
ఇక దేశంలో వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు.. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అందుబాటులోకి తీసుకు రావడం జరిగింది.ఈ సీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం చిన్న ఇంకా సన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరేలా ప్రతీ ఏటా కూడా రూ. 6 వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక రూ. 2 వేలు చొప్పున మూడు విడతల్లో ఈ సాయాన్ని రైతులకు అందిస్తోంది. ఇంకా అలాగే ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద భూమి ఉన్న రైతు కుటుంబాలకు ప్రతి నాలుగు నెలలకు రూ.2000 చొప్పున నగదు అనేది నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.ఇంకా అలాగే మే 31, 2022న ప్రధానమంత్రి-కిసాన్ పథకం 11వ విడతగా 10 కోట్ల మంది రైతులకు కూడా లబ్ధిచేకూరింది. మొత్తం రూ. 21,000 కోట్లకు పైగా నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. అయితే ఇక ఇప్పుడు 12 విడత నగదు పంపిణీ ఎప్పుడు జరుగుతుందో తెలుసుకోండి..ఇక PM కిసాన్ యోజన 12 వ విడత నగదు బహుశా సెప్టెంబర్ 1, 2022 తర్వాత విడుదల చేసే అవకాశం ఉంది.


సాధారణంగా, మొదటి వ్యవధి వచ్చేసి ఏప్రిల్ నెల నుంచి జూలై నెల వరకు, రెండవది ఆగస్టు నెల నుంచి నవంబర్ నెల వరకు ఇంకా మూడో విడత నగదు పంపిణీ.. డిసెంబర్ నెల నుంచి మార్చి నెల వరకు కూడా ఉంటుంది.కాగా ఇక ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి నగదు పంపిణీ పథకం అమలులో ఎలాంటి అవినీతి ఇంకా అలాగే అక్రమాలకు తావు లేకుండా గతంలో కేవైసీ చేసుకున్న ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా ఈ-కేవైసీ నమోదు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం కూడా తెలిసిందే. ఈ నగదు జమ కావాలంటే తప్పనిసరిగా ఈ కేవైసీ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. పీఎం కీసాన్ లబ్ధిదారులందరికీ eKYC గడువును కేంద్ర ప్రభుత్వం మే 31 వ తేదీ నుంచి జూలై 31 వ తేదీ వరకు కూడా పొడిగించింది. PMKISAN పోర్టల్‌లో OTP ఆధారిత eKYC అనేది అందుబాటులో ఉంది. ఇంకా బయోమెట్రిక్ ఆధారిత eKYC కోసం సమీపంలోని CSC కేంద్రాలను సంప్రదించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: