LIC : 8 వేల పెట్టుబడితో 5 లక్షలు పొందే సూపర్ ప్లాన్!

Purushottham Vinay
ఇక భారత దేశంలో అతి పెద్ద లైఫ్ ఇన్స్యూరెన్స్ సంస్థ ఎల్‌ఐసీ అందరికి కూడా అందుబాటులో ఉండే ఒక కొత్త పాలసీని తీసుకు వచ్చింది. ఈ పాలసీ ద్వారా ఎన్నో రకాల లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి.ఇంకా లాభాలను అందించే వాటిలో ఎల్‌ఐసీ జీవన్ లాభ్ ప్లాన్ కూడా ఒకటని చెప్పాలి.ఇంకా అలాగే దీనివల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి. ఈ ప్లాన్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మూడు వేర్వేరు నిబంధనలను కూడా మనం ఎంచుకోవచ్చు. వాటి ప్రకారం ప్రీమియం డిపాజిట్ అనేది చేయాల్సి ఉంటుంది.ఇకపోతే ఈ ప్లాన్ కోసం కనీస వయస్సు వచ్చేసి 8 సంవత్సరాలు ఇంకా గరిష్ట వయస్సు 59 సంవత్సరాలు ఉండాలి.అలాగే ఈ ప్లాన్‌లో కనీస హామీ రూ. 2 లక్షలు. దీనికి గరిష్ట పరిమితి లేదు. ఇందులో 16 సంవత్సరాలు ఇంకా 21 సంవత్సరాలు లేదా 25 సంవత్సరాల ప్రకారం కాలపరిమితి ఉంటుంది. అయితే ఇక్కడ ఎంచుకున్న టర్మ్ ప్రకారం ప్రీమియం కనిష్ట సంవత్సరాలకు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అలాగే 16 ఏళ్ల కాలపరిమితిని ఎంచుకుంటే 10 ఏళ్లపాటు ప్రీమియం కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా 21 ఏళ్ల కాలపరిమితిని ఎంచుకుంటే 15 ఏళ్లపాటు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.


 అలాగే 25 ఏళ్ల కాలపరిమితిని కనుక ఎంచుకుంటే మొత్తం 16 ఏళ్లపాటు ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది.ఇది 25 ఏళ్ల వయస్సులో ప్రారంభించాలి. అలాగే సమ్ అష్యూర్డ్ వచ్చేసి రూ. 20 లక్షలతో ఎంచుకోవాలి. ఇంకా అలాగే కాలపరిమితి వచ్చేసి 25 సంవత్సరాలు తీసుకోవలసి ఉంటుంది. ఇక దీని కింద మొదటి ఏడాది వచ్చేసి ప్రీమియంగా మొత్తం రూ.93584 చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో వచ్చే ఏడాది నుంచి కూడా మొత్తం రూ.91569 ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది.ఈ టర్మ్‌ను కనుక 25 సంవత్సరాలు పాటు తీసుకుంటే ప్రీమియం అనేది ఇక 16 సంవత్సరాలు మాత్రమే చెల్లించాలి.ఇక 16 సంవత్సరాల తర్వాత ఎటువంటి ప్రీమియం అనేది కట్టనవసరం లేదు..ఆ తర్వాత పాలసీ తీసుకున్న వ్యక్తికి 50 సంవత్సరాల వచ్చే సరికి మొత్తం 52,50000 డబ్బుని చివరికి పొందుతాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

LIC

సంబంధిత వార్తలు: