పిల్లల భవిష్యత్తుకి ఉపయోగపడే మంచి పథకాలు ఇవే!

Purushottham Vinay
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) పథకం అనేది దీర్ఘకాలిక పెట్టుబడి ఎంపిక. ప్రస్తుతం ఈ పథకం కింద 7.1% వార్షిక వడ్డీ అనేది వస్తోంది. ఇక ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా, మీరు కోటి కంటే ఎక్కువ ఫండ్‌ను చాలా సులభంగా సృష్టించవచ్చు. ఇందులో మీరు పొందే రిటర్న్స్ కూడా పూర్తిగా పన్ను రహితం. సంవత్సరంలో డిపాజిట్ చేసిన మొత్తాన్ని కూడా IT చట్టంలోని సెక్షన్ 80C కింద మినహాయింపుగా మీరు క్లెయిమ్ చేయవచ్చు. ఈ పథకంలో కనీస పెట్టుబడి మొత్తం రూ.500 కాగా గరిష్ట పెట్టుబడి వచ్చేసి మొత్తం సంవత్సరానికి రూ. 1.5 లక్షలు. ఇక ఈ PPF ఖాతా 15 సంవత్సరాలలో మెచ్యూర్ అవుతుంది, అయితే, మెచ్యూరిటీకి ముందు సంవత్సరానికి 5-5 సంవత్సరాలు మీరు పొడిగించుకోవచ్చు. అంటే, మీరు ఈ పథకంలో మొత్తం 25 సంవత్సరాల పాటు ఈజీగా పెట్టుబడి పెట్టవచ్చు. మీరు 15 ఇంకా 20 లేదా 25 సంవత్సరాల తర్వాత మీ డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ పథకం మీకు రిస్క్ ఫ్రీ రిటర్న్‌లను కూడా హామీ ఇస్తుంది.


ఇక పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) పథకం 6.8% వార్షిక రాబడిని అందిస్తుంది. ఈ ఎన్‌ఎస్‌సిలో చేసిన పెట్టుబడులకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద మొత్తం రూ. 1.5 లక్షల వరకు మినహాయింపు కూడా లభిస్తుంది. అయితే మీరు ఈ పథకంలో కనీసం రూ. 1000 పెట్టుబడి పెట్టాలి. మీరు ఎన్‌ఎస్‌సిలో ఎంత మొత్తాన్ని అయినా చాలా ఈజీగా పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో గరిష్ట పెట్టుబడి పరిమితి అనేది కూడా లేదు. NSC లాక్ ఇన్ పీరియడ్ వచ్చేసి మొత్తం 5 సంవత్సరాలు. ఇక ఈ పథకంలో అయితే , పిల్లల పేరు మీద కూడా మీరు ఖాతా తెరవవచ్చు. పిల్లల వయస్సు కనుక 10 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే, అతని/ఆమె పేరుతో తల్లిదండ్రుల తరపున ఖాతాను తెరవవచ్చు. ఇక 10 సంవత్సరాల వయస్సులో, పిల్లవాడు తన స్వంత ఖాతాను కూడా ఆపరేట్ చేయవచ్చు. ఇక పెద్ద వయస్సు వచ్చిన తర్వాత, అతను ఈ ఖాతా పూర్తి బాధ్యతను పొందుతాడు. మీరు ఈ పథకంలో కనుక డబ్బు పెట్టుబడి పెడితే, ఆ డబ్బు రెట్టింపు కావడానికి 10 సంవత్సరాల 6 నెలల సమయం పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: