కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. ఆ వడ్డీ రేట్లు తగ్గింపు!

Purushottham Vinay
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్తని అందించింది. ఇక ఇల్లు కట్టుకొనేందుకు తీసుకున్న అడ్వాన్స్‌పై వడ్డీరేటును కేంద్ర ప్రభుత్వం తగ్గించింది.ఇక ప్రస్తుతం 7.9 శాతంగా ఉన్న వడ్డీని 7.1 శాతానికి కేంద్రం తగ్గించింది. 2023 మార్చి దాకా కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. 2022-23 సంవత్సరానికి గాను హౌజింగ్‌ కన్స్‌స్ట్రక్చన్‌ అడ్వాన్స్‌ ఇంట్రెస్టు రేటు వచ్చేసి 7.1 శాతంగా ఉంటుందని అర్బన్‌ అఫైర్స్‌ మినిస్ట్రీ 2022, ఏప్రిల్‌ 1వ తేదీన ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. ఇక ఈ పథకం అనేది కేవలం కేంద్ర ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందట.ఇక వడ్డీరేటుని తగ్గించడం వల్ల కేంద్ర ఉద్యోగులకు ఉపశమనం అనేది కలగనుంది. 'హౌజ్‌ బిల్డింగ్‌ అడ్వాన్స్‌ రూల్స్‌ (HBA)-2017ను సవరించాలని ఆదేశాలు కూడా అందాయి. ఇక నుంచి ఇల్లు కట్టుకొనేందుకు అడ్వాన్స్‌ తీసుకున్న ఉద్యోగులకు వడ్డీరేను 7.10 శాతమే అమలు చేస్తారని సమాచారం తెలిసింది.గత సంవత్సరం అనగా 2022 ఏప్రిల్‌ 1 నుంచి వచ్చే సంవత్సరం అనగా 2023 మార్చి 31 వ తేదీ వరకు కూడా ఇదే వడ్డీరేటు అమలవుతుంది' అని అర్బన్‌ మినిస్ట్రీ తెలిపింది. 2023 ఆర్థిక సంవత్సరంలో వడ్డీరేటును 80 బేసిస్‌ పాయింట్ల మేర కోత విధించడమే దీనికి కారణమట.


ఇక ఉద్యోగులు ఇల్లు కట్టుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం అడ్వాన్స్‌ ని చెల్లిస్తుంది. ఉద్యోగి లేదా అతడి భార్య ప్లాట్‌లో నిర్మించుకొనేందుకు అవకాశం అనేది ఉంటుంది. 2020, అక్టోబర్ నెలలో ఈ పథకాన్ని మోదీ ప్రభుత్వం ఆరంభించడం జరిగింది. ఇక ఈ పథకం కింద 2022 మార్చి 31 దాకా 7.9 శాతం వడ్డీరేటుని అమలు చేశారు. ఇప్పుడు ఆ వడ్డీ రేటుని తగ్గించారు.కేంద్ర ప్రభుత్వం ఇంతకు ముందే ఉద్యోగులకు డీఏ పెంచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 31 శాతంగా ఉన్న డీఏని 34 శాతానికి పెంచనుంది. ఇక కేంద్ర కేబినెట్‌ ఈ మేరకు నిర్ణయం కూడా తీసుకుంది.ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా అలాగే పింఛన్‌దారులకు 31 శాతం డీఏ ఇస్తున్నారు. ఇక దీనిని మరో 3 శాతానికి పెంచడంతో డీఏ టోటల్ గా 34 శాతానికి చేరుతుంది. బడ్జెట్ రెండో దశ సమావేశాలకు మునుపే కేబినెట్‌ సమావేశమవ్వడం జరిగింది. ఇక అప్పుడే ఈ అంశం చర్చకు వచ్చింది. తాజాగా ఈ నిర్ణయాన్ని ప్రకటించడం అనేది గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: