ఇలా మొబైల్ లోనే ఆధార్ ని సింపుల్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు..

Purushottham Vinay
భారతీయ పౌరులందరికీ కూడా ఆధార్ కార్డ్ అనేది అతి ముఖ్యమైన పత్రాలలో ఒకటిగా మారింది. దేశంలోని ప్రతి పౌరుడు కూడా ఆధార్ కార్డును కలిగి ఉండడాన్ని భారత ప్రభుత్వం తప్పనిసరి చెయ్యడం జరిగింది. ఇక ఆధార్ కార్డును యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ పథకాలకే కాకుండా ఆర్థిక సేవలకు కూడా ఆధార్ కార్డ్ అనేది అవసరంగా మారింది. ఇది బ్యాంక్ ఖాతాలు, వాహనాలు ఇంకా బీమా పాలసీలు మొదలైన వాటితో కూడా అనుసంధానించబడి ఉంది. ఆధార్ కార్డ్‌లో వ్యక్తి పేరు, పుట్టిన తేదీ, లింగం, చిరునామా ఇంకా ఫోటోగ్రాఫ్ వివరాలు ఉంటాయి. ఇక మన ఆధార్ కార్డ్ యొక్క భౌతిక కాపీని ఎల్లప్పుడూ కూడా మనం కలిగి ఉండము. అధికారిక వెబ్‌సైట్ ద్వారా భారతీయులు తమ ఆధార్ కార్డును పొందేందుకు ఇప్పుడు uidai అనుమతిస్తుంది. నేరుగా ఆధార్ లింక్ eaadhaar.uidai.gov.in ద్వారా ఆధార్ కార్డును మొబైల్ ఫోన్లోనే ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

ఇక ఆ విషయాన్ని uidai సోషల్ మీడియాలో ఇలా పేర్కొంది, “మీరు పూర్తి ఆధార్ నంబర్‌ను ప్రదర్శించే ‘రెగ్యులర్ ఆధార్’ లేదా చివరి నాలుగు అంకెలను మాత్రమే చూపే ‘మాస్క్డ్ ఆధార్’ని డౌన్‌లోడ్ చేసుకోవడాన్ని ఎంచుకోవచ్చు.” ఎక్కడైనా ఎప్పుడైనా eaadhaar.uidai.gov.in నుండి ఆధార్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో అనే వీడియో ట్యుటోరియల్ కూడా షేర్ చేయబడటం జరిగింది.ఇక డైరెక్ట్ లింక్ నుండి ఆధార్‌ని డౌన్‌లోడ్ చేయడం ఎలాగో తెలుసుకుందాం...

దశ 1: అధికారిక వెబ్‌సైట్ eaadhaar.uidai.gov.inని సందర్శించి, ‘మీ ఆధార్ యొక్క ఎలక్ట్రానిక్ కాపీని డౌన్‌లోడ్ చేయండి’ అనే లింక్‌పై క్లిక్ చేయండి.

దశ 2: మీ సూచనగా 'ఆధార్ నంబర్'ని ఎంచుకుని, పేజీ కింద ఉన్న పెట్టెలో 12-అంకెల ప్రత్యేక IDని నమోదు చేయండి.

దశ 3: ఇక మాస్క్డ్ ఆధార్ కార్డ్ కోసం, ‘నాకు మాస్క్డ్ ఆధార్ కావాలి’ అనే ఆప్షన్‌పైన క్లిక్ చేయండి.

దశ 4: తరువాత Send OTP ఎంపికపైన క్లిక్ చేయండి. మీ ఆధార్-లింక్ చేయబడిన మొబైల్ నంబర్ ఆ తర్వాత 'వన్‌టైమ్ పాస్‌వర్డ్' ని అందుకుంటుంది.

దశ 5: ఇక మీ OTPని నమోదు చేసి, 'సమర్పించు' ఎంపికపైన మీరు క్లిక్ చేయండి.

దశ 6: 'డౌన్‌లోడ్ ఆధార్' ఎంపికను ఎంచుకోవడం ద్వారా OTPని విజయవంతంగా ప్రామాణీకరించిన తర్వాత మీరు మీ ఆధార్ PDF వెర్షన్‌ను మీరు ఈజీగా పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: