వోడాఫోన్ వినియోగదారులకు ఆర్బీఐ షాక్.. !

Durga Writes

వోడాఫోన్.. ఈ రిజర్వు బ్యాంకుకు ఎప్పటికప్పుడు షాక్ లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే కస్టమర్లు లేక చస్తున్న ఈ వోడాఫోన్ కు చచ్చిన పామును మళ్ళి కొట్టినట్టు ఇప్పుడు తాజాగా ఆర్బీఐ షాక్ ఇచ్చింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా టెలికం కంపెనీ వొడాఫోన్ ఎం పెసా సర్టిఫికెట్‌ ఆఫ్ ఆథరైజేషన్ (సీవోఏ)ను రద్దు చేసింది. 

 

కంపెనీయే స్వచ్ఛందంగా ఎం పెసా అథరైజేషన్ సర్టిఫికేట్‌ను వెనక్కి తిరిగిచ్చేయడం ఇందుకు కారణం. ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో ఇకపై కంపెనీ కస్టమర్లకు సేవలు అందించడం కుదరదు. ఎం పైసా.. ప్రిపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ బిజినెస్ కార్యకలాపాలను నిర్వహించడం ఇకపై కుదరదు. అయితే కస్టమర్లు, మర్చంట్లకు వచ్చిన నష్టం ఏమి ఉండదు. 

 

ఏదైనా వాలిడ్ క్లెయిమ్ కలిగి ఉంటే సెటిల్‌మెంట్ కోసం కంపెనీని సంప్రదించవచ్చు. అయితే కంపెనీ మూడేళ్లలోపు సెటిల్‌మెంట్ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. రిజర్వు బ్యాంక్ 2015లో 11 సంస్థలకు పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్‌లు ఇచ్చింది. వీటిల్లో వొడాఫోన్ ఎం పెసా కూడా ఒకటి. కాగా వొడాఫోన్, ఐడియా కంపెనీల విలీనం కారణంగానే ఈ సర్వీసును క్లోజ్ చేయాలనుకుంది వోడాఫోన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: