కొత్త ఆల్ ఇన్ వన్ ప్లాన్స్ తో దుమ్ములేపిన జియో: ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలకు కోలుకోలేని దెబ్బ

Padigala Nagaraju

జియో తన కొత్త రీఛార్జ్ ప్లాన్లను ప్రకటించింది, ఈ ప్లాన్లలో అన్లిమిటెడ్ కాల్స్, డేటా లభిస్తుండడంతో జియో వీటిని 'ఆల్ ఇన్ వన్ ప్లాన్స్' అని పిలుస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలోని టెలికాం ఆపరేటర్ జియో భారతి ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా సంస్థలు ధరల పెంపును ప్రకటించిన తరువాత తాను కూడా ధరలు పెంచుతున్నట్లు స్పష్టం చేసింది. కొత్త రీఛార్జ్ ప్లాన్లను డిసెంబర్ 6 న నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. జియో తన కొత్త ఆల్ ఇన్ వన్ ప్లాన్స్ ను నిన్న విడుదల చేసింది.

 

రిలయన్స్ జియో కొత్త ఆల్ ఇన్ వన్ ప్లాన్స్ లో పాత ప్లాన్స్ లో ఉన్న ధరలను ఈ విధంగా మార్చింది ఇక ఇప్పుడు రూ. 153 ప్లాన్ రూ. 199, రూ. 198 ప్లాన్ రూ. 249, రూ. 299 ప్లాన్ రూ. 349, రూ. 349 ప్లాన్ రూ. 399, రూ. 448 ప్లాన్ రూ. 599, రూ. 1,699 ప్లాన్ నుండి రూ. 2,199, మరియు రూ. 98 ప్లాన్ రూ. 129 గా మారాయి.

 

అయితే జియో ప్రత్యర్థి కంపెనీలు అందిస్తున్న డేటా మరియు కాల్స్ ను వారికంటే తక్కువకు అందిస్తోంది. ఉదాహరణకు జియో లో రు 599 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే 84 రోజులకు గానూ డైలీ 2 జీబీ డేటా, జియో నుంచి జియోకు అన్లిమిటెడ్ కాల్స్ మరియు జియో నుంచి వేరే నెటవర్క్లకు ఫోన్ చేసుకోవడానికి 3,000 నిముషాలు అందిస్తోంది. ఇక ఇదే ప్లాన్ ఎయిర్టెల్ లో రూ 698 గా ఉంది అంటే జియో కు ఎయిర్టెల్ రూ 100 వ్యత్యాసం ఉంది. 

 

ఇక అదే విధంగా రూ. 199 ప్లాన్ నెలకు చెల్లుబాటు అయ్యే ప్లాన్, ఇది రోజుకు 1.5 జిబిని అందిస్తుంది, మరియు ప్రత్యర్థి టెలికాం ఆపరేటర్ల రూ 249 ప్లాన్ కంటే ఇది 25 శాతం చౌకగా ఉంటుంది. ఇక అలాగే కొత్త రీఛార్జ్ ప్లాన్స్ తీసుకున్న వారికి 300 శాతానికి పైగా అదనపు బెనిఫిట్స్ ఉంటాయని జియో పేర్కొంది. మొత్తానికి ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా సంస్థలు ధరలు పెంచిన తరువాత ఆచితూచి అడుగు వేసి వాళ్ళకంటే తక్కువ ధరకే అవే ప్లాన్స్ ను జియో తీసుకు వచ్చింది. ఈ దెబ్బతో ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు ఏం చేస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: