కర్ణాటకు రూ. 5000 కోట్లు.. తెలంగాణకు 0.. అయినా అద్భుతమే?

Chakravarthi Kalyan
అద్భుతమైన బడ్జెట్ ను ఆర్ధికమంత్రి ప్రవేశపెట్టారని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ ఆశాజనక బడ్జెట్ గా ప్రపంచం గుర్తిస్తుందంటున్నారు. మోడీ చేసేదే చెప్తారు... అని బడ్జెట్ ద్వారా స్పష్టం అవుతోందని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అంటున్నారు. అభివృద్ధి చెందిన దేశంగా తీర్చి దిద్దేలా బడ్జెట్ ఉందన్న.. బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. అన్ని రంగాలకు అన్ని వర్గాలకు ప్రాధాన్యత కల్పించేలా బడ్జెట్ ఉందన్నారు. దేశంలో మౌలిక వసతుల కల్పనకి పెద్దపీట వేశారని.. పన్ను రాయితీల్లో పేద, మధ్యతరగతి వారికి బడ్జెట్ లో ఊరట కల్పించిందని.. దేశాన్ని, ప్రజలను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశ్యంతోనే ఈ బడ్జెట్ ప్రవేశ పెట్టారని బండి సంజయ్ అన్నారు.

మంచి బడ్జెట్ ను దేశ ప్రజలకు అందించిన మోడీకి కృతజ్ఞతలు తెలిపిన బండి సంజయ్.. కర్ణాటక కరువు ప్రాంతంగా చూపారు కాబట్టి నిధులు కేటాయించారని.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్  ముందు తెలంగాణ రైతులకు రుణమాఫీ చేసి... రైతులను ఆదుకోవాలి, ఫసల్ భీమా ఆమోదించాలన్న బండి సంజయ్.. తెలంగాణ ప్రభుత్వానికి ట్రిపుల్ ఐటీ నిర్వహణ చేతకావడం లేదన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ బడ్జెట్ బట్టే బాజ్ బడ్జెట్ అని.. తెలంగాణ బడ్జెట్ అర్ధం పర్ధం లేని బడ్జెట్ గా ఉంటుందని బండి సంజయ్ అంచనా వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: