విమానం వెళ్తుంటూనే డోర్‌ తీశాడు.. ఏమైందంటే?

Chakravarthi Kalyan
విమానం వెళ్తుంటూనే డోర్‌ తీస్తే ఎంత ప్రమాదకరం.. తాజాగా అలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. విమానంలో అత్యవసర ద్వారం తెరిచి ఓ ప్రయాణికుడు కలకలం సృష్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతేడాది డిసెంబరు 10న చెన్నై - తిరుచిరాపల్లి ఇండిగో విమానంలో ఈ ఘటన జరిగిందట. విమానం టేకాఫ్‌కు సిద్ధమైన సమయంలో ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్‌ తెరిచాడు. దీంతో విమానంలోని ప్రయాణికులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారట.అయితే.. అప్రమత్తమైన సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దారు. విమానం లోపల పీడనం సరిచూసుకుని‌, ఇతర తనిఖీల అనంతరం విమానం బయల్దేరింది. అయితే.. ఈ వ్యవహారంపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది. ఎయిరిండియా విమానంలో ఇటీవల తరచూ వివాదాస్పద ఘటనలు జరుగుతున్నాయి. ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన, భోజనంలో రాళ్లు.. మద్యం మత్తులో టాయిలెట్‌లో పొగతాగడం వంటి ఘటనలు జరిగాయి. ఇలాంటి చర్యలపై కఠినంగా వ్యవహరించాలని డీజీసీఏ వార్నింగ్ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: