నేడే.. బీజేపీ కీలక మీటింగ్‌.. నడ్డా ఫ్యూచర్‌ తేలేనా?

Chakravarthi Kalyan
ఢిల్లీ వేదికగా రెండు రోజుల పాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఇవాళ, రేపు ఢిల్లీలోని ఎన్డిఎంసి కేంద్రంలో ఈ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. రెండు రోజులు జరిగే సమావేశాల్లో చర్చించే అంశాలు, తీర్మానాలపై జాతీయ పదాథికారుల సమావేశం అజెండా ఖరారు చేయనుంది. ఉదయం 10.30గం.లకు బీజేపీ కేంద్ర కార్యాలయంలో జాతీయ పదాథికారులు భేటీ కానున్నారు. మంగళ, బుధవారాల్లో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశంలో... పలు కీలక విషయాలు చర్చించే అవకాశాలు ఉన్నట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు.

వచ్చే నెలాఖరుతో జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం ముగియనుంది. ఆయన పదవీకాలం పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయ, ఆర్థిక, విదేశాంగ విధానాలపై మూడు వేరువేరు తీర్మానాలు చేయవచ్చని కూడా బీజేపీ నేతలు చెబుతున్నారు. జి20 కి భారత్ నేతృత్వం వహిస్తున్న నేపథ్యంలో.. పార్టీ తరపున విస్తృత ప్రచారం నిర్వహించే విషయంపై కూడా చర్చించి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న 9 రాష్ట్రాల్లో అనుసరించాల్సిన విధానంపై కూడా చర్చించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP

సంబంధిత వార్తలు: