ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ఏపీలో 108 సిబ్బంది ధర్నాకు దిగారు. ఏపీ రాష్ట్రంలో ఉన్న 108 సిబ్బంది జిల్లా నేతలు విజయవాడ ధర్నాచౌక్ రిలే నిరహారదీక్ష ను చేపట్టారు. తమకు ఆప్కాస్ లో చేర్చాలని డిమాండ్ 108 సిబ్బంది చేస్తున్నారు. సీఎం జగన్ తమకు గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని 108 సిబ్బంది కోరుతున్నారు . కోవిడ్ సమయంలో ప్రాణాలను తెగించి పనిచేసిన 108 సిబ్బందిని ప్రభుత్వం విస్మరిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిట్ నెస్ లేని వాహనాల కారణంగా సకాలంలో బాధితులను ఆసుపత్రులకు చేర్చలేకపోతున్నామని 108 సిబ్బంది చెబుతున్నారు.
12 గంటల పని సమయాన్ని తగ్గించాలని 108 సిబ్బంది కోరుతున్నారు. గత నెల 14 న సమ్మె నోటీసు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదన్న 108 సిబ్బంది.. సమస్యలు నెరవేర్చకపోతే ఈనెల 15 తర్వాత సమ్మెకు దిగుతామని సిబ్బంది హెచ్చరిస్తున్నారు.