జగన్.. ఆ సలహాలు మరీ అంతా కాస్ట్లీనా?

Chakravarthi Kalyan
సీఎం జగన్‌ ప్రభుత్వం నియమిస్తున్న సలహాదారులపై అనేక విమర్శలు వస్తున్నాయి. సలహాదారుల పేరుతో సీఎం జగన్‌ తన అవినీతి, ఆర్థిక నేరాల్ని సమర్థించే వారిని అందలం ఎక్కిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. సలహాదారుల పేరుతో సొంత సామాజికవర్గం వారికి నాలుగేళ్లలో రూ.145 కోట్ల ప్రజాధనాన్ని దోచిపెట్టారని టీడీపీ ఆరోపిస్తోంది. అలాంటి వారిని లక్షల జీతాలిచ్చి ఎందుకు పోషిస్తున్నారన్న హైకోర్టు ప్రశ్నకు జగన్ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

మొత్తం సలహాదారుల్లో 65 మందిలో 60 మంది జగన్‌ సామాజికవర్గం వారేనని టీడీపీ ఆరోపిస్తోంది. వీళ్లందరి అర్హత జగన్‌ తప్పుల్ని, ఆర్థిక నేరాలను సమర్థించి ఆయనకు సహాయసహకారాలు అందించడమేనని టీడీపీ మండిపడుతోంది. అంతేకాదు..  వీరిచ్చే సలహాలు చీకటి జీవోలు ఇవ్వడం, కులమతాల మధ్య చిచ్చులు పెట్టమని ప్రోత్సహించడమేనని ఎద్దేవా చేస్తోంది. ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టేలా.. గిట్టనివారి ఆస్తులు, ప్రజల ఆస్తుల్ని విధ్వంసం చేసేలా అధికార యంత్రాంగాన్ని పురమాయించడమే’సలహాదారుల పని అని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: