చంద్రబాబు కంటే తానే పుడింగి అంటున్న పెద్దిరెడ్డి?

Chakravarthi Kalyan
చంద్రబాబు కంటే తానే పుడింగినని మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రా రెడ్డి అంటున్నారు. అసలు పుడింగి అంటే చంద్రబాబుకు అర్థం తెలుసా అని మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అడుగుతున్నారు. కుప్పంలో చంద్రబాబు నా గురించి పుంగనూరు పుడంగి అంటూ వ్యాఖ్యలు చేశాడని.. అసలు పుడింగి అంటే చంద్రబాబుకు అర్థం తెలుసా అని మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ప్రశ్నించారు. ఆ మాటకు అర్థం ఆయన కంటే బలవంతుడు అన్న మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి.. అంటే చంద్రబాబు కంటే నేనే బలవంతుడిని అని ఆయనే ఒప్పుకుంటున్నాడని ఎద్దేవా చేశారు.

కుప్పంలో చంద్రబాబు వరుసగా స్థానిక ఎన్నికల్లో ఘోర ఓటమిని చూశాడని... తన నియోజకవర్గంలోనే గెలుపునకు దూరమైన ఆయన పుంగనూరులో నాపైన పోటీ చేస్తాననడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అన్నారు. వైయస్ జగన్ గారి ఆధ్వర్యంలో పంచాయతీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబును మూడు చెరువుల నీరు తాగించిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించిన మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి... ఇలాంటి వ్యక్తి పుంగనూరులో నా కథ ఏమిటో తేలుస్తాను అని బీరాలు పలుకుతున్నాడని ఎద్దేవా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: