కాంగ్రెస్‌ వ్యూహకర్తకు షాక్‌.. విచారణకు రావాల్సిందే?

Chakravarthi Kalyan
కాంగ్రెస్ వార్ రూం కేసులో పోలీసుల విచారణకు హాజరు కావాలని రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలుకు తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. సునీల్ కనుగోలు ను అరెస్టు చేయవద్దని పోలీసులను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈనెల 8న విచారణకు హాజరు కావాలని సునీల్ కనుగోలుకు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఇటీవల సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు జారీ చేశారు. ఫేస్‌బుక్ లో తెలంగాణ గళం పేజీలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితల ఫోటోలను మార్ఫింగ్ చేసి కించపరిచేలా పోస్టులు పెట్టారన్న అంశంపై దర్యాప్తులో భాగంగా సునీల్ కనుగోలుకు నోటీసులు ఇచ్చారు.
నోటీసులను సవాల్ చేస్తూ సునీల్ కనుగోలు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.సురేందర్ తీర్పు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ టాస్క్‌ఫోర్స్ సభ్యుడినని.. తనకు ఆ పోస్టులతో ఎలాంటి సంబంధం లేదని సునీల్ కనుగోలు వాదించారు. కేసును, నోటీసులను కొట్టివేసేందుకు నిరాకరించిన హైకోర్టు.. కేసును, సీఆర్‌పీసీ 41 ఏ నోటీసును రద్దు చేసేందుకు నిరాకరించింది. విచారణకు హాజరు కావాలని సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: