మంచితనంతో చైనాకు బుద్ది చెప్పిన తైవాన్‌?

Chakravarthi Kalyan
చైనా తైవాన్ ను ఆక్రమించుకోవాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. అయితే.. తాజాగా తన మంచితనంతో తైవాన్ చైనాకు బుద్ది చెప్పింది. కరోనాను ఎదుర్కొనేందుకు చైనాకు అవసరమైన సాయం అందజేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని తైవాన్‌ అధ్యక్షురాలు త్సాయ్‌ ఇంగ్‌ వెన్‌ ప్రకటించారు. మానవీయ కోణంలో ప్రజలు మహమ్మారి నుంచి బయటపడేలా అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తైవాన్‌ అధ్యక్షురాలు త్సాయ్‌ ఇంగ్‌ వెన్‌ తెలిపారు.

అయితే.. గతేడాది తైవాన్‌లో కొవిడ్‌ కేసులు పెరిగిన సమయంలో ఆ దేశానికి వ్యాక్సిన్లు అందకుండా చేసేందుకు చైనా కుట్రలు చేసింది. అయినా ఇప్పుడు తాను చైనాకు సాయం చేస్తానంటూ తైవాన్‌ ముందుకు రావడం విశేషం. తైవాన్‌ లక్ష్యంగా చైనా సైన్యం కవ్వింపులు శాంతికి, స్థిరత్వానికి ఏ రకంగానూ ఉపయోగపడవని తైవాన్‌ అధ్యక్షురాలు త్సాయ్‌ ఇంగ్‌ వెన్‌ అంటున్నారు. చైనాతో చర్చల విషయంలో సానుకూల వైఖరిని తైవాన్‌ అధ్యక్షురాలు త్సాయ్‌ ఇంగ్‌ వెన్‌ వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: