కేసీఆర్ "ఫామ్‌ హౌస్‌ ఫైల్స్" సినిమా అట్టర్‌ఫ్లాప్‌?

Chakravarthi Kalyan
కేసీఆర్ దర్శకత్వంలో రూపొందించిన ఫామ్‌ హౌస్ ఫైల్స్‌ సినిమాలో ఏమాత్రం పస లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ కథ, స్క్రీన్‌ ప్లే విఫలమైందని కిషన్ రెడ్డి అన్నారు. ఈ కేసులో కీలక ఆధారం అని చెప్పిన పైసలే లేనప్పుడు ఈడీ ఎలా విచారిస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నవ్వుల పాలవుతూ...తెలంగాణ పేరును దేశవ్యాప్తంగా నవ్వులపాలు చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌ లో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేల ఫోన్‌లు ఎందుకు రికవరీ చేయలేదో కేసీఆర్ ఇప్పటికి సమాధానం చెప్పడంలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దుయ్యబట్టారు.
ఎమ్మెల్యేలను వారాలపాటు ప్రగతిభవన్‌లో ఎందుకు బంధించారో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి  డిమాండ్ చేశారు. సిట్ కేసును సీబీఐకి బదిలీ చేయాలనే హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కోర్టు తీర్పు కేసీఆర్‌కు  చెంప పెట్టులాంటిదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: