ఆ విషయంలో ఏపీ దేశంలోనే నెంబర్ వన్‌?

Chakravarthi Kalyan
దేశంలోనే రాష్ట్రంలో పండ్లు, కూరగాయాల సాగులో అగ్రగామిగా నిలిచిందని అగ్రి మిషన్‌ వైస్‌ చైర్మన్ ఎంవీఎస్‌ నాగిరెడ్డి అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను మించిన సంక్షేమం దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఉందా అని ఎంవీఎస్‌ నాగిరెడ్డి ప్రశ్నించారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే రైతులకు అండగా నిలిచారన్న ఎంవీఎస్‌ నాగిరెడ్డి.. మూడున్నరేళ్ల కాలంలో రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు.

చంద్రబాబు హయాంలోనే ఖరీఫ్‌లో ఉత్పత్తి అతి తక్కువగా జరిగిందన్న ఎంవీఎస్‌ నాగిరెడ్డి..  వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కాగానే అత్యధికంగా ఖరీఫ్‌లో ఉత్పత్తులు సాధించారన్నారు.  లాభదాయక పంటలు పండించే విధంగా ప్రభుత్వం పని చేస్తోందని... హార్టికల్చర్‌ సాగు కూడా పెరిగిందని ఎంవీఎస్‌ నాగిరెడ్డి అన్నారు. ఆక్వా కల్చర్, వ్యవసాయం, హార్టికల్చర్‌ ఈ మూడు రంగాలు కలిపి సాగు అంచనాలు వేస్తారన్న ఎంవీఎస్‌ నాగిరెడ్డి.. 40 శాతం హార్టికల్చర్‌ ఉత్పత్తులు పెరిగాయని తెలిపారు. 2022వ సంవ‌త్సరం జగన్నామ సంక్షేమ సంవత్సరమ‌ని ఎంవీఎస్‌ నాగిరెడ్డి వర్ణించారు. వ్యవసాయ రంగాన్ని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి లాభదాయకంగా చేశారని ఎంవీఎస్‌ నాగిరెడ్డి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: