వారసుడ్ని పిలుస్తున్న తెలుగుదేశం?

Chakravarthi Kalyan
ఎన్టీఆర్ కుటుంబానికి వారసత్వ రాజకీయాలు అబ్బలేదు. దేశంలోని అన్ని రాజకీయా పార్టీల్లో వారసులున్నారు. కాకపోతే ఎన్టీఆర్ తెలుగుదేశానికి వారసుడిగా అల్లుడు అయ్యారు. ఎన్టీఆర్ కుమారుల్లో హరికృష్ణను రాజకీయంగా తొక్కేశారు. బాలకృష్ణను ఎమ్మెల్యే పదవికి మాత్రమే పరిమితం చేశారు. ఇప్పుడు చంద్రబాబు కుమారుడు లోకేశ్ చురుగ్గా ఉన్నారు. ఆయనే వారసుడు కావచ్చేమో. కాకపోతే ఇప్పుడు వారసుడనంటూ మరొక పేరు తెరపైకి వచ్చింది. తారకరత్న రాజకీయాల్లోకి వస్తున్నాని ప్రకటన చేశారు. తెలుగు దేశం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. తను ఎక్కడో ఒక దగ్గర్నుంచి పోటీ చేసేలా టికెట్ కూడా ఇవ్వాలని చంద్రబాబుకి అల్టిమేటం జారీ చేశారు.

మరోవైపు నందమూరి ఫ్యామిలీలో విపరీతంగా ఫేం ఉంది జూనియర్ ఎన్టీఆర్ కే. ఆయన ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారని నందమూరి అభిమానులు అడుగుతున్నారు. కాగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారని.. కాకపోతే ఆయన కావాలనుకున్నప్పుడే వస్తారన్నారు తారక రత్న. అంటే తెలుగు దేశం పార్టీ పిలిస్తే కాదు.. ఎన్టీఆర్ రావాలనుకున్నప్పుడే రాజకీయాల్లోకి వస్తారని హింట్ ఇచ్చారు. తెలుగు దేశం పిలిస్తే కాదు.. ఆయనంతట ఆయనే రావాలి. మరోవైపు టీడీపీ గెలవాలంటే .. ఎన్టీఆర్ రావాల్సిందేనని అభిమానులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: