ఆ పరీక్షలో భారత్ సక్సస్.. చైనా గుండెళ్లో రైళ్లు?

Chakravarthi Kalyan
భారత్‌ అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. అణ్వాయుధ సామర్థ్యం గల ఖండాంతర క్షిపణి అగ్ని-5ని మన భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఈ అగ్ని 5 క్షిపణికి.. ఐదు వేల కిలో మీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించ గల సత్తా ఉంది. 17 మీటర్ల ఎత్తైన ఈ అస్త్రం అత్యంత కచ్చితత్వంతో అగ్ని 5 క్షిపణి లక్ష్యాలను ఛేదిస్తుంది. అంతే కాదు.. అగ్ని 5 క్షిపణి 1.5 టన్నుల వార్‌ హెడ్‌ను మోసుకుపోతుంది. తాజాగా చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో ఇండియా ఈ క్షిపణి పరీక్షను నిర్వహించడం హాట్ టాపిక్ అయ్యింది.
ఇక చైనా విషయానికి వస్తే.. ఆ దేశం వద్ద డాంగ్‌  ఫెంగ్-41 వంటి వంటి క్షిపణులున్నాయి. వీటి పరిధి 12 నుంచి 15 వేల కిలో మీటర్లు. అందుకే  చైనాను దృష్టిలో పెట్టుకుని అగ్ని-5 ను భారత్ రూపొందించింది. ఉత్తర చైనా భాగంతో పాటు ఐరోపాలోని కొన్ని ప్రాంతాలు ఈ క్షిపణి పరిధిలోకి రావడంతో ఇప్పుడు చైనా గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: