జగనన్నా.. బాబోయ్.. ఈ ఒత్తిడి మావల్ల కాదు..!

Chakravarthi Kalyan
భూముల రీసర్వేకు సంబంధించి అధికారుల ఒత్తిళ్లు భరించలేకపోతున్నామని ఏపీ వీఆర్వోలు అంటున్నారు. అధికారుల ఒత్తిళ్లు భరించలేకపోతున్నామంటూ ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. సోమవారం నుంచి తహశీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేస్తామంటున్నారు. భోజన విరామంలో నిరసనలు తెలుపుతామని ఏపీ వీఆర్ వోల సంఘం రాష్ట్ర అ‍ధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు ప్రకటించారు. రోజుకు 30 ఎకరాల చొప్పున వంద రోజుల్లో భూముల రీసర్వే పూర్తిచేయాలని తమకు టార్గెట్ విధించడం సరికాదని వీఆర్ వోల సంఘం రాష్ట్ర అ‍ధ్యక్షుడు అన్నారు.

ఇలా టార్గెట్ల వల్ల రీసర్వే ప్రక్రియలో తప్పులు జరిగే ప్రమాదం ఉందని వీఆర్ వోల సంఘం రాష్ట్ర అ‍ధ్యక్షుడు ఆక్షేపించారు. పనుల ఒత్తిడితో.. బయోమెట్రిక్ హాజరు కూడా వేయలేకపోతున్నామని వీఆర్ వోల సంఘం రాష్ట్ర అ‍ధ్యక్షుడు ఆవేదన వెలిబుచ్చారు. భూముల సర్వే ప్రక్రియలో తాము సొంత డబ్బు ఖర్చు చేస్తున్నామని వీఆర్ వోల సంఘం రాష్ట్ర అ‍ధ్యక్షుడు అ్నారు. పూర్తి చేసిన పనులకు బిల్లులు మంజూరు చేయడం లేదని భూపతిరాజు ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: