గుడ్ న్యూస్.. రూ.7880 కోట్లు.. 17 మెడికల్ కాలేజీలు!

Chakravarthi Kalyan
వైద్యం అందరికీ అందాలనే ఉద్దేశ్యంతో ఏపీ ప్రభుత్వం సర్కారీ వైద్యాన్ని ప్రోత్సహిస్తోంది.  ఆధునిక టెక్నాలజీతో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రయత్నిస్తోంది.  వైద్య రంగానికి ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విశేష ప్రాధాన్యమిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ. 7880 కోట్లతో 17 మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నారు. అంతే కాదు.. ఇందులో 5 కాలేజీల్లో వచ్చే ఏడాది నుంచి అడ్మిషన్లు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

పేదలందరికీ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో వైసీపీ భుత్వం కొత్తగా 3 వేలకు పైగా రుగ్మతలను ఆరోగ్యశ్రీలో చేర్చింది.  41వ రాష్ట్ర డెంటల్ కాన్ఫరెన్స్ లో వైయ‌స్ఆర్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వై.వి.సుబ్బారెడ్డి ఈ వివరాలు వెల్లడించారు. ఈ డెంటల్ డాక్టర్లందరికి కాన్ఫరెన్స్ ఒక దిక్సూచిలా ఉపయోగపడాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. తర్వాత 42వ డెంటల్ కాన్ఫరెన్స్ విజయవాడలో నిర్వహించనున్నట్టు సదస్సు నిర్వాహకులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: