బిగ్ బ్రేకింగ్: మళ్లీ ఆస్పత్రిలో చేరిన సమంత..!

Divya
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొన్ని రోజుల నుంచి మయో సిటీస్ అనే భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు హాస్పిటల్లో ఉండి చికిత్స తీసుకున్న సమంత.. ఇటీవల ఆ సమస్య నుంచీ కోలుకొని.. యశోద సినిమా ప్రమోషన్స్ లో కూడా పాల్గొనింది. ప్రస్తుతం తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టిన సమంత ఉన్నట్టుండి మళ్లీ మయో సిటీస్ సమస్యతో హైదరాబాదులోని ఒక ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. సమంత అనారోగ్య పరిస్థితి తెలిసి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరొకపక్క సెలబ్రిటీలు , కుటుంబ సభ్యులు సమంత అనారోగ్య పరిస్థితి పై చింతిస్తున్నట్లు సమాచారం.

సమంత ఉన్నట్టుండి మళ్లీ అనారోగ్యం బారినపడి హాస్పిటల్లో జాయిన్ అవ్వడంతో ప్రతి ఒక్కరు ఆమెకేమైంది అని తెలుసుకోవడానికి తెగ కంగారుపడుతున్నారు. ఏదిఏమైనా సమంత త్వరగా ఆ జబ్బు నుంచి కోలుకొని.. మళ్ళీ మామూలు పొజిషన్ కి రావాలని కోరుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని చెప్పవచ్చు. మరి సమంత కెరియర్ విషయానికి వస్తే ఇన్ని రోజులు తెలుగు , తమిళ్  సినిమాలతో బిజీగా ఉన్న ఈమె ప్రస్తుతం బాలీవుడ్,  హాలీవుడ్ సినిమాలపై దృష్టి సారించింది . ఈ క్రమంలోనే అక్కడ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇస్తోంది.

ప్రస్తుతం ఈమె నటించిన యశోద సినిమా విడుదలవగా త్వరలోనే శాకుంతలం సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. యశోద సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సమంత.. శాకుంతలం సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి.  ఇదిలా ఉండగా అనారోగ్య పరిస్థితులతో ఇబ్బంది పడుతున్నప్పటికీ.. ఆమె సినిమా సక్సెస్ కోసం ప్రమోషన్ లో భాగం కావడంతో ఆమెపై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.సమంత కెరియర్ విషయానికి వస్తే.. త్వరలోనే యశోద 2,  యశోద 3 చిత్రాలను తెరకెక్కించడానికి దర్శకుడు హరి హరీష్ సన్నాహాల సిద్ధం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: