కేసీఆర్‌ గుడ్‌న్యూస్‌: ఆ భూములకు పట్టాలు..?

Chakravarthi Kalyan
తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఓ గుడ్ న్యూస్‌ చెప్పారు. పోడు భూముల పట్టాలను వచ్చేనెలలో లబ్దిదారులకు పంపిణీ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం భావిస్తున్నట్లు మంత్రి సత్యవతి రాధోడ్‌ వివరించారు. దీని కోసం విజ్ఞాపనల తనిఖీ, సర్వే పూర్తికి అదనపు బృందాలు ఏర్పాటు చేయాలని మంత్రి సత్యవతి రాధోడ్‌ సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో గిరిజనులకు అన్యాయం జరగొద్దని మంత్రి సత్యవతి రాధోడ్‌ తేల్చి చెప్పారు.

 రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు  సమన్వయంతో ఈ కార్యక్రమం కోసం పనిచేయాలని  మంత్రి సత్యవతి రాధోడ్‌  కోరారు. గిరివికాస్ పథకాన్ని రైతులు సద్వినియోగంచేసుకునేలా చూడాలని సత్యవతి రాథోడ్‌ సూచించారు.  సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు... పోడుభూముల సర్వే పూర్తిచేసి గ్రామ, డివిజన్‌, జిల్లా సభలు నిర్వహించాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ స్పష్టంచేశారు. క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి,పోడు భూముల సర్వేకార్యక్రమాలు పొందుపర్చేందుకు అధికారులకు ట్యాబ్స్ అందించినట్లు మంత్రి సత్యవతి రాధోడ్‌  తెలిపారు. నిబంధనల ప్రకారం ఉన్న పోడు భూముల పట్టాలను వచ్చేనెలలో లబ్దిదారులకు పంపిణీ చేయాలని  ప్రభుత్వం భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: