నా ప్రాణాలకు హాని.. రాజాసింగ్‌ షాకింగ్‌ లేఖ?

Chakravarthi Kalyan
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటిలిజెన్స్ ఐజీకి మరోసారి లేఖ రాశారు. తనకు ప్రాణహాని ఉందని.. తనకు కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించాలని లేఖ రాశారు. తనకు తరచూ మరమ్మతులకు గురవుతున్న వాహనాన్నే తిరిగి కేటాయిస్తున్నారుని.. 2010 మోడల్ కు చెందిన వాహనంలో అత్యవసర పరిస్థితుల్లో ఎటూ వెళ్లలేకపోతున్నానని  ఎమ్మెల్యే రాజాసింగ్  తెలిపారు.
బుల్లెట్ ప్రూఫ్ వాహనం దారిమధ్యలోనే నిలిచిపోతోందని.. ఇటీవల కొంత మంది ఎమ్మెల్యేలకు నూతన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కేటాయించారని.. కానీ ఆ జాబితాలో నా పేరు లేకపోవడం ఆశ్చర్యకరంగా ఉందని ఎమ్మెల్యే రాజాసింగ్  లేఖలో పేర్కొన్నారు.  తీవ్రవాదుల నుంచి నాకు ప్రాణహాని ఉన్న విషయం పోలీసులకు తెలుసున్న ఎమ్మెల్యే రాజాసింగ్ .. అయినా భద్రత విషయంలో తాత్సారం వహిస్తున్నారని ప్రశ్నించారు. దీని వల్ల ఉగ్రవాదులు, సంఘవిద్రోహ శక్తులు నాపై  దాడి చేసేలా అవకాశం ఇస్తున్నారుని ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖలో రాశారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం మార్చకపోతే, దీన్ని ఇంటిలిజెన్స్ అధికారులు తీసుకోవాలని.. ఈ పాత వాహనాన్ని నేను వినియోగించలేనని ఎమ్మెల్యే రాజాసింగ్  తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: