ఏపీలో భూమి పత్రాల్లో కీలక మార్పు..?

Chakravarthi Kalyan
ఏపీలో భూమి హక్కుల పత్రాల్లో మార్పులు రాబోతున్నాయి. త్వరలో భూమి హక్కులకు సంబంధించి భూహక్కు నిర్దారణ పత్రం టైటిల్ ను రెవెన్యూ శాఖ జారీ చేయబోతోందని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ప్రస్తుతం వీటిని కోర్టులు ఇస్తున్నాయని.. ఇకపైన రెవెన్యూ శాఖ టైటిల్ ను జారీచేయనుందని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు.

ఇప్పటికే అసెంబ్లీలో ఈ కొత్త విధానాన్ని ఉంచామని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు  చెప్పారు. రెవెన్యూ ఉద్యోగులు, ప్రభుత్వం వేర్వేరు కాదని... ప్రభుత్వానికి రెవెన్యూ ఉద్యోగులు నాడీ మండలం లాంటివారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. రెవెన్యూ శాఖలో బ్రిటిష్ కాలం నాటి చట్టాలున్నాయన్న రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ...కాలానుగుణ మార్పులకు అనుగుణంగా వీటిని క్రమేపీ సంస్కరించనున్నామని చెప్పారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో రీ సర్వే ప్రక్రియ విజయవంతంగా నడుస్తుందని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: