ఆంధ్రప్రదేశ్‌కు కీలక వాతావరణ హెచ్చరిక..?

Chakravarthi Kalyan
ఆంధ్రప్రదేశ్‌కు కీలక వాతావరణ హెచ్చరికను వాతావరణ శాఖ జారీ చేసింది. ఈ నెల తొమ్మిదో తేదీ నాటికి నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంకకు దగ్గరగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ తర్వాత 48 గంటల్లో తమిళనాడు- పుదుచ్చేరి తీరాలకు దగ్గరగా బలపడుతుందట. ఆ తర్వాత అది వాయుగుండంగా మారే సూచనలు ఉన్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఈ ప్రభావం వల్ల  11వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రలో చాలాచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వివరించింది. కోస్తాంధ్ర, తమిళనాడు తీరాల్లో 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే రెండు రోజులు మాత్రం కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పూర్తిగా పొడి వాతావరణం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: