లవ్‌ మేరేజ్‌ చేసుకుంటే రూ.1.20 లక్షలు కానుక?

Chakravarthi Kalyan
ప్రేమ వివాహం చేసుకుంటే ఏపీ సర్కారు లక్షా 20 వేల రూపాయలు కానుక ఇవ్వబోతోంది. అయితే.. అది ఎస్సీ, ఎస్టీల్లో కులాంత వివాహాలై ఉండాలి. అలా అయితే. 1.20 లక్షలు ఇవ్వనున్నారు. బీసీలకు 50వేలు ఇవ్వనున్నారు. బీసీల కులాంతర వివాహాలకు 75వేలు ఇవ్వనున్నారు. వైఎస్ ఆర్ షాదీ తోఫా పథకం కింద మైనార్టీలకు 1లక్ష ఇవ్వనున్నారు. విభిన్న ప్రతిభావంతులకు 1 లక్ష 50 వేలు ఇవ్వనున్నారు.

భవన, ఇతర నిర్మాణ కార్మికులకు 40వేలు ఇవ్వనున్నారు. గత ప్రభుత్వం పెళ్లికానుక ద్వారా ప్రకటించిన దానికన్నా.. ఇప్పుడు దాదాపుగా రెట్టింపు ప్రొత్సాహకం ఈ పథకం ద్వారా అందిస్తున్నారు. వివక్షకు, లంచాలకు తావు లేకుండా గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ఈపథకం అమలు చేస్తున్నారు. అక్టోబరు 1 నుంచి ఈ రెండు పథకాలు అమల్లోకి రానున్నాయి.  పెళ్లైన 60 రోజుల్లో వారి గ్రామ, వార్డు సచివాలయాల్లో  వాలంటీర్ల  సహాకారంతో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన వారికి ప్రతి మూడు నెలలకోసారి ఈ పథకాన్ని వర్తింప చేస్తారు. జనవరి, ఏప్రిల్‌, జులై, అక్టోబరులో పథకాలకు నిధులు అందించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: