హైదరాబాద్‌: మూడేళ్ల తర్వాత మ్యాచ్.. సందడే సందడి?

Chakravarthi Kalyan
హైదరాబాద్‌ మూడేళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తోంది. మూడేళ్ల తర్వాత హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఇవాళ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరగబోతోంది. అస్ట్రేలియాలో మూడు టి20 ల సిరీస్ లో భాగంగా మూడో మ్యాచ్ కొద్ది గంటల్లో జరగబోతోంది. ఇప్పటికే సిరీస్ 1-1 తో ఇరు జట్లు సమంగా ఉన్నాయి. ఈ సిరీస్ డిసైడ్ చేసే మ్యాచ్ కావడంతో ఫ్యాన్స్ తో సహా అంతా ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.
ఇక ఉప్పల్ స్టేడియంలో చివరిగా 2019 డిసెంబర్ 6న వెస్టిండీస్ టి 20 మ్యాచ్ జరిగింది. ఆ తర్వాత ఏ మ్యాచ్ జరగలేదు. 2019 మార్చి 2న చివరగా ఆస్ట్రేలియాతో వన్డే మ్యాచ్ ఇక్కడ జరిగింది. అంతకు ముందు 2018 అక్టోబర్ 12 నుంచి 16 వరకూ చివరగా వెస్టిండీస్ తో టెస్ట్ మ్యాచ్ జరిగింది.
మన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో 55వేల మంది కూర్చునే సామర్ధ్యం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: